రేపటి నుంచి అమల్లోకి వచ్చే కోవిడ్-19 నూతన మార్గదర్శకాలు ఇవే…

Centre Covid-19 Guidelines, Centre Covid-19 Guidelines News, Centre Issues New Covid Guidelines from Dec 1, Centre Issues New Covid-19 Guidelines, Centre new Covid guidelines, Coronavirus New Guidelines, Mango News Telugu, MHA Covid Guidelines, MHA Covid-19 Guidelines rules, MHA issues new COVID-19 guidelines, New Covid-19 Guidelines

దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో కరోనాపై నిఘా, నియంత్రణ, అప్రమత్తత కోసం అన్ని రాష్ట్రాలు పాటించాల్సిన నూతన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. నూతన మార్గదర్శకాలు రేపటి నుంచి అనగా డిసెంబర్ 1 నుంచి 31 వ తేదీ వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రభుత్వాలు కరోనా నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో పండుగ సీజన్ అనంతరం వైరస్ మళ్లీ విజృంభిస్తుండడంతో ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు తెలిపారు.

కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం ఇటీవల జారీచేసిన కొత్త మార్గదర్శకాలు:

  • స్థానిక పరిస్థితిని అంచనా వేసిన తర్వాత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం రాత్రిపూట కర్ఫ్యూ లాంటి కొన్ని ఆంక్షలు విధించవచ్చు. అయితే కేంద్రం నుంచి ముందస్తు అనుమతి లేకుండా కంటైన్మెంట్ జోన్లకు వెలుపల స్థానికంగా లాక్ డౌన్ మాత్రం విధించకూడదు.
  • రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో అక్కడి జిల్లా అధికారుల చేత కంటైన్మెంట్ జోన్ల పరిధులు కచ్చితంగా గుర్తించేట్టు చూడాలి. ఇందుకు సంబంధించి ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలు పాటించాలి. జిల్లా కలెక్టర్లు కంటైన్మెంట్ జోన్ల వివరాలను వెబ్ సైట్ లో ప్రదర్శించాలి. అలాగే ఆ జాబితాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు కూడా పంపాలి.
  • కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర కార్యకలాపాలు మాత్రమే అనుమతించాలి.
    కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కచ్చితంగా అమలు చేయాలి. అక్కడ ప్రజలు బైటికి వెళ్ళటం లేదా లోపలికి రావటాన్ని పూర్తిగా నియంత్రించాలి. నిత్యావసరాలు, వైద్య అవసరాలకు మాత్రమే అనుమతించాలి. ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్ళి పరిశీలించేలా చూడాలి.
  • పాజిటివ్ గా తేలిన వ్యక్తులు ఎవరిని కలిసారో గుర్తించి, జాబితాగా తయారు చేయాలి. వారి ఆచూకీ కనిపెట్టి వారిని 14 రోజులపాటుగా క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షించాలి.
  • శ్వాస సంబంధమైన వ్యాధులున్నవారికి ఆరోగ్య కేంద్రాలలో లేదా మొబైల్ సేవల ద్వారా లేదా బఫర్ జోన్లలో ఉన్న చికిత్సాకేంద్రాల ద్వారా చికిత్స అందేట్టు చూడాలి.
  • కంటైన్మెంట్ జోన్లలో చర్యలను కఠినంగా అమలు చేయటంలో స్థానిక జిల్లా అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలి. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆయా అధికారులను బాధ్యులను చేయాలి.
  • రాష్ట్రాలలో మాస్కులు ధరించటాన్ని, చేతుల పరిశుభ్రత ఉంచుకోడాన్ని కచ్చితంగా అమలు చేయాలి. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వ్యక్తులకు జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలించవచ్చు.
  • రద్దీగా ఉండే మార్కెట్లు, వీకెండ్ సంతలు, ప్రజారవాణా కేంద్రాలలో భౌతిక దూరం పాటించటానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడిగా ప్రామాణిక ఆచరణావిధానాలను జారీ చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటిని తప్పనిసరిగా పాటించాలి.
  • కంటైన్మెంట్ జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలకూ ఆమోదం ఉంది. కొన్ని అంశాలకు మాత్రం కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతి ఉంటుంది.
  • హోం మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చిన మేరకే అంతర్జాతీయ ప్రయాణానికి ఆమోదం ఉంటుంది.
  • సినిమా థియేటర్లకు 50% సామర్థ్యంతో తెరవడానికే అనుమతి.
  • స్విమ్మింగ్ పూల్స్ లో కేవలం క్రీడాకారులకు మాత్రమే అనుమతి.
  • బిజినెస్ టు బిజినెస్ వ్యాపారులకోసం మాత్రమే ఎగ్జిబిషన్ హాల్స్ కు అనుమతి.
  • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమపరిధిలోని కార్యాలయాలలో భౌతిక దూరం పాటించే నిబంధనలు అమలు చేయాలి. వారం వారం పాజిటివ్ ల శాతం 10 శాతాన్ని మించి ఉంటున్నట్టు తేలిన నగరాలలో కార్యాలయాల సమయాలను విడి విడిగా మార్చి అమలు చేయటం, తదితర చర్యల అమలును పరిశీలించాలి. ఒకే సమయంలో హాజరయ్యే ఉద్యోగుల సంఖ్య కనీస స్థాయిలో ఉండేట్టు చూసుకోవటం ద్వాతా భౌతిక దూరాన్ని అమలు చేయాలి.
  • రాష్ట్రం లోపలగాని, అంతర్రాష్ట్ర కదలికలపై గాని ఆంక్షలు లేవు.
  • రాష్ట్రం లోపలగాని, రాష్ట్రాల మధ్య గాని వ్యక్తుల రాకపోకలకు, సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలూ ఉండవు. విదేశీ సరకు రవాణాకు కూడా ఈ సడలింపు అమలులో ఉంటుంది.
  • ఎలాంటి ప్రత్యేకమైన అనుమతులు గాని, ఈ-పాస్ లు గాని అవసరం లేదు.
  • కరోనా బారిన పడేందుకు ఎక్కువ అవకాశమున్న 65 ఏళ్ల వయసు పైబడినవారు, దీర్ఘకాల వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇళ్ళలోనే ఉండడం మంచిది. అత్యవసరమైన పనులు, వైద్యపరమైన అవసరాలకు మాత్రమే ఇళ్లనుండి బయటకు రావాలి.
  • ఆరోగ్య సేతు మొబైల్ యాప్ వాడకాన్ని ఎప్పటిలాగే ప్రోత్సహించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − six =