దేశంలో కొత్తగా 37,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,96,718 కు చేరుకుంది. ఇక కరోనాతో మరో 369 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,41,411 కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు ఎక్కువుగా నమోదు అయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 3,91,256 (1.18%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 39,114 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,22,64,051 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.48 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.34 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 8, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 53,49,43,093
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 3,30,96,718
- కొత్తగా నమోదైన కేసులు [సెప్టెంబర్ 7–సెప్టెంబర్ 8 (8AM-8AM)] : 37,875
- నమోదైన మరణాలు : 369
- రికవరీ అయిన వారి సంఖ్య : 3,22,64,051
- యాక్టీవ్ కేసులు : 3,91,256
- మొత్తం మరణాల సంఖ్య : 4,41,411
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ