భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 24,010 కరోనా కేసులు, 355 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 99,56,557 కు, మరణాల సంఖ్య 1,44,451 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 3,22,366 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు
మరోవైపు కొత్తగా 33,291 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 94,89,740 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 95.31 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ఇక డిసెంబర్ 17 నాటికీ దేశంలో 15,78,05,240 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 11,58,960 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ