చైనాలో వెలుగు చూసిన మరో ప్రమాదకర వైరస్‌ ‘ఏవియన్ ఫ్లూ’.. ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు

China Reports World's First Human Case of H3N8 Bird Flu A 4-Year-Old Found Infected, China reports first human case of H3N8 bird flu, China Reports World's First Human Case of H3N8 Bird Flu, A 4-Year-Old Boy Found Infected, first human case of H3N8 bird flu, H3N8 bird flu, bird flu H3N8, bird flu, H3N8 bird flu News, H3N8 bird flu Latest News, H3N8 bird flu Latest Updates, H3N8 bird flu first human case Reports In China, bird flu first human case Reports In China, China has recorded the first human infection with the H3N8 strain of Bird Flu, Mango News, Mango News Telugu,

కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మరో కొత్త ప్రాణాంతక వైరస్ పురుడు పోసుకుంది. దీంతో మరోసారి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ప్రమాదకర వైరస్‌ ‘ఏవియన్ ఫ్లూ’ చైనాలో ఒక బాలుడిలో వెలుగు చూసింది. కాగా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ కేసు కావడం గమనార్హం. ఏవియన్ ఫ్లూ యొక్క H3N8 జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసును చైనా ధృవీకరించింది. సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న నాలుగేళ్ల బాలుడు జ్వరం మరియు ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తర్వాత, నిర్వహించిన పరీక్షలలో ఈ కొత్త స్ట్రెయిన్‌కు పాజిటివ్ వచ్చినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (NHC) మంగళవారం తెలిపింది. అయితే ప్రజలలో విస్తృతంగా వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉందని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ఇది గుర్రాలు, కుక్కలు మరియు సీల్స్‌కు సోకుతుందని, కానీ ఇంతకు ముందు మానవులలో కనుగొనబడలేదని అధికారులు పేర్కొన్నారు.

ఆ బాలుడి కుటుంబం ఇంట్లో కోళ్లను పెంచుటున్నారు. అలాగే వారు నివసించే ప్రాంతంలో అడవి బాతుల సంచారం ఎక్కువగా ఉంటుందని NHC ఒక ప్రకటనలో తెలిపింది. కాగా బాలుడు నేరుగా పక్షుల ద్వారా వ్యాధి బారిన పడ్డాడని వారు తెలిపారు. అయితే అతని ద్వారా ఇంతవరకు అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకలేదు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం తమ పౌరులను అప్రమత్తం చేస్తోంది. చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని మరియు జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు తక్షణ చికిత్సను పొందాలని ప్రజలను హెచ్చరించింది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ప్రధానంగా అడవి పక్షులు మరియు పౌల్ట్రీలలో సంభవిస్తుంది. అయితే ఇది మనుషుల మధ్య వ్యాపించినట్లు ఇంతవరకూ కనుగొనలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, జూనోటిక్ లేదా జంతువుల ద్వారా సంక్రమించే ఇన్‌ఫ్లుఎంజా యొక్క మానవ అంటువ్యాధులు “ప్రాథమికంగా సోకిన జంతువులు లేదా కలుషితమైన పరిసరాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా సోకుతాయి. అయితే ఈ వైరస్‌ ప్రజలలో ఒకరి నుంచి ఇంకొకరికి సోకటంలో అంత సమర్థవంతంగా వ్యాప్తి చెందవు”.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 4 =