దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శార్ధూల్ ఠాకూర్ రికార్డు ప్రదర్శనతో చెలరేగాడు. 61 పరుగులకే 7 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. సఫారీ గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. దీంతో, 229 పరుగులకు దక్షిణాఫ్రికా ఆల్ అవుట్ అయింది. అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మయాంక్ (23), రాహుల్ (8) అవుట్ కాగా… పుజారా (35 బ్యాటింగ్; 7 ఫోర్లు), రహానే (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌కు 58 పరుగుల ఆధిక్యం ఉంది.
అయితే, దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్ శార్ధూల్ ఠాకూర్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. నిప్పులు చెరిగే బంతులతో సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 17.5 ఓవర్లు మాత్రమే వేసి 61 పరుగులిచ్చి కీలకమైన 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. ఆతిథ్య జట్టు బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. సఫారీ బ్యాటర్లలో కీగన్ పీటర్సెన్ (62), తెంబా బవుమా (51) మినహా పెద్దగా ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో షమీకి రెండు వికెట్లు దక్కగా, బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ