అవును..ఆ​కాశంలో ఆ నక్షత్రాల లెక్కలన్నీ మారిపోతాయట..

Will there be no more stars in the sky in the future,Will there be no more stars,stars in the sky in the future,no more stars in the sky,Mango News,Mango News Telugu, calculations of stars, in the future, in the sky, no more stars, no more stars in future, sky, The Milky Way Galaxy,calculations of stars Latest News,calculations of stars Latest Updates,no more stars in the sky Latest News,no more stars in the sky Latest Updates
stars

చిన్నప్పుడు రాత్రయితే చాలు ప్రతి ఒక్కరికీ ఒక దినచర్య కామన్‌గా ఉండేది. త్వరత్వరగా తినేసి ఆరు బయటో, డాబామీదో పక్కలేసుకుని ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలెన్నో లెక్కపెడుతూ పిల్లలు సంబరపడిపోతుంటే .. వారి సంతోషంలో తామూ వాటాలేసుకునే పెద్దవాళ్లు ప్రతి ఇంటిలోనూ కనిపించేవారు. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం పల్లెటూళ్లలోనూ కనిపించడం లేదు.

ఉమ్మడి కుటుంబాలు దూరం అవడం, చాలామంది జీవనాధారం కోసం , చదువుల కోసం పట్టణాలకు వలస పోవడంతోనే పల్లెటూళ్లు చిన్నబోయాయి. ఇక ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టడం అనేది , ఏ నక్షత్రానికి ఏం పేరు పెట్టాలనేది ఇప్పటి జనరేషన్‌కు ఏమాత్రం తెలియదు.అయితే కోట్ల కొద్దీ నక్షత్రాలు కనువిందు చేసేవాటిలో రకరకాల ఆకారాలూ కనిపిస్తుంటాయి. కానీ భవిష్యత్తులో మాత్రం ఆ నక్షత్రాల లెక్కలన్నీ మారిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అవును ఆకాశంలో కనిపించే నక్షత్రాలన్నీ తమ తమ స్థానాలు మారిపోతాయని.. అంతేకాదు ఆకాశాన్ని అత్యంత ప్రకాశవంతమైన వెలుగు ఆక్రమిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ, దగ్గరలోని ఆండ్రోమెడా అనే మరో గెలాక్సీ రెండు ఒకదాని కొకటి ఢీకొని కలసిపోనుండటమే దీనికి కారణమని చెబుతున్నారు.

ఇప్పటికే పాలపుంత గెలాక్సీ, ఆండ్రోమెడా గెలాక్సీ..ఈ రెండూ ఒకదానికొకటి దగ్గరలోకి వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి రెండూ మరో 375 కోట్ల ఏళ్ల తర్వాత ఢీకొనడం మొదలవుతుందట. ఆ తర్వాత సుమారు 700 కోట్ల ఏళ్ల తర్వాత..ఆ రెండూ పూర్తిగా కలిసిపోయి పెద్ద గెలాక్సీగా మారిపోతాయట. ఇది జరిగే సమయంలో చాలా నక్షత్రాలు చెల్లాచెదురైపోవడమే కాకుండా..వాటి స్థానాలు మారిపోతాయి.

అంతేకాదు ఇలా రెండు గెలాక్సీలు దగ్గరికి రావడం, కలిసిపోవడం జరుగుతున్న సమయంలో.. ఆకాశం ఎలా కనిపిస్తుందనే దానిపై ఏకంగా నాసా ఓ వీడియోను కూడా రూపొందించింది. చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ తీసిన ఫోటోలతో పాటు, దాని సహాయంతో చేసిన పరిశీలన ఆధారంగా ఓ వీడియోను సిద్ధం చేసిన నాసా.. చంద్ర అబ్జర్వేటరీ పేరుతో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్’ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

నిజానికి మన సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ అంటూ ఫోటోల్లో, ఇంటర్నెట్‌లో మనం చూస్తూ ఉన్నది పాలపుంత ఫోటో కానే కాదట. అసలు ఎవరికీ కూడా పాలపుంత మొత్తం చిత్రాన్ని తీయడం సాధ్యమే కాదట. ఎందుకంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలున్న పాలపుంత గెలాక్సీలో.. మధ్య భాగానికి ఓ పక్కన సూర్యుడు, భూమి ఉంటాయి.

దీనివలన పాలపుంత గెలాక్సీ మొత్తాన్ని కూడా దాటి బయటికి వెళితేనే తప్ప మిల్క్ వేను ఫోటో తీయలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెబుతున్నారు. సముద్రం మధ్య చిన్న పడవలో కెమెరా పట్టుకుని కూర్చుని..వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్రం మొత్తాన్ని ఫోటో తీయడం ఎంత ఇంపాజిబుల్‌నో.. పాలపుంత గెలాక్సీని మొత్తం ఫోటో తీయడం కూడా అంతే అసాధ్యమట. అలా అయితే మనం పాలపుంత గెలాక్సీ అని చూసేది ఏంటనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. అది సుమారుగా పాలపుంతలా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ చిత్రమేనట. . ఈ ఆండ్రోమెడా గెలాక్సీనే.. భవిష్యత్తులో పాలపుంతను ఢీకొడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eight =