రెబెల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల వాయిదా

Mango News, Prabhas and Pooja Hegde starrer Radhe Shyam, Prabhas and Pooja Hegde’s Radhe Shyam postponed, Prabhas Starrer Radheshyam Movie Postponed, Prabhas-Pooja Hegde starrer postponed due to COVID, Radhe Shyam, Radhe Shyam postponed, Radheshyam Movie, Radheshyam Movie News, Radheshyam Movie Postponed, Radheshyam Movie Updates, Rebel Star Prabhas, Rebel Star Prabhas Starrer Radheshyam Movie Postponed

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్’ విడుదల వాయిదా పడింది. దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇటీవలే ‘RRR‘ వాయిదా పడగా.. ఇప్పుడు ఆ జాబితాలో రాధేశ్యామ్ చిత్రం చేరింది. ‘రాధేశ్యామ్’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

“గత కొన్నిరోజులుగా ‘రాధేశ్యామ్‘ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు మేము ప్రయత్నించాం. కానీ, ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల రీత్యా చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి వస్తాం” అని టీమ్ తెలిపింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా.. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seven =