గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను విడుదల చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ఆవిష్కరించారు. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద 9 నుంచి 14 ఏండ్ల మధ్య వయసు బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కోవిడ్ వర్కింగ్ గ్రూప్, నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా చెప్పారు. ఈ వ్యాక్సిన్ 85 నుంచి 90 శాతం కేసులను నివారించగలదని, దీని ప్రభావంతో ఇంకో 30 ఏళ్ల తర్వాత దేశంలో సెర్వైకల్ క్యాన్సర్ కేసులే ఉండవని ఆయన తెలిపారు.
అయితే 9 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ను జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా.. ఎస్ఐఐ మరియు డీబీటీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం గమనార్హం. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దీనికి అనుమతినిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకారం.. 14 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో వెలుగుచూసే క్యాన్సర్‌లలో గర్భాశయ క్యాన్సర్ రెండవది. ఇక భారతదేశంలో ఏటా సుమారు 20 శాతం కేసులు నమోదవుతున్నట్లు తేలింది. ఈ కొత్త వ్యాక్సిన్‌ను రోగులకు రెండు లేదా మూడు డోసుల్లో టీకాలు ఇవ్వబడతాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ