కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా సుదీర్ఘ లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో మార్చ్ 22 వ తేదీ నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులును నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్‌డౌన్ అమలులో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వగా, మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే జూలై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు(అంతర్జాతీయ విమాన సేవలు) కూడా పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు విమానయాన మంత్రిత్వ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉంది.
అయితే అంతర్జాతీయ విమాన సేవల ప్రారంభంపై ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు దేశంలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9304 కరోనా పాజిటివ్ కేసులు, 260 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒకేరోజున ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. జూన్ 4, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,16,919 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu