దేశంలో మరో 1590 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 8 వేలు దాటిన యాక్టీవ్ కేసులు

India Records 1590 New Covid-19 Positive Cases and Active Cases Tally Exceeds Again 8000,India New Covid-19 Cases,India Registers 1590 New Cases,India Active Cases Exceeds 8000,Mango News,Mango News Telugu,Coronavirus Cases In 24 Hours,Covid-19 in India,Information about COVID-19,India Covid Last 24 Hours Report,Active Corona Cases,Corona Active Cases Exceeds,Corona News,Corona Updates,Coronavirus In India,Coronavirus Outbreak,COVID 19 India,COVID 19 Updates,Covid in India,Covid Last 24 Hours Record,Covid Last 24 Hours Report,Covid Live Updates,Covid News And Live Updates,Covid Vaccine,Covid Vaccine Updates And News,COVID-19 Latest News And Updates

దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 1590 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,47,02,257కు చేరుకుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో 343, గుజరాత్ లో 241, కేరళలో 223, ఢిల్లీలో 152, కర్ణాటకలో 131, హిమాచల్ ప్రదేశ్ లో 100 వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. ఇక కరోనా వలన మరో 6 మరణాలు (మహారాష్ట్రలో 3, రాజస్థాన్ లో 1, కర్ణాటకలో 1, ఉత్తరాఖండ్ లో 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,824కి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య మళ్ళీ ఎనిమిది వేలు (8601 (0.02%) దాటింది. అలాగే మరో 910 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,62,832 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.79 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా మార్చి 25, శనివారం ఉదయం 8 గంటల వరకు 220.65 కోట్లకుపైగా (220,65,44,324) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయి. మొత్తం 220.65 కోట్ల వ్యాక్సిన్ డోసులలో 95.20 కోట్ల సెకండ్ డోస్ మరియు 22.86 కోట్ల ప్రికాషన్ డోస్ ఇవ్వబడ్డాయన్నారు. గత 24 గంటల్లో 9,497 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − two =