నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్

India PSLV-C49, International Customer Satellites, isro, ISRO initiates launch sequence for PSLV-C49, ISRO Latest News, ISRO Launches PSLV C-49 Carrying EOS-01, ISRO Launches PSLV-C49 With EOS-01, ISRO PSLV-C49, PSLV C-49 Carrying EOS-01, PSLV C49 launch, PSLV-C49, PSLV-C49 with latest earth observation satellite EOS-01

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నవంబర్ 7, శనివారం మధ్యాహ్నం 3.12 గంటలకి పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్ ను ప్రయోగించింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్ (ఈఓఎస్‌-1)‌తో పాటు విదేశాలకు చెందిన మ‌రో 9 క‌స్ట‌మ‌ర్ శాటిలైట్లను పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్ మోసుకెళ్లింది. ఈఓఎస్‌-1 అనే శాటిలైట్ ద్వారా వ్యవసాయం, అటవీ మరియు విపత్తు నిర్వహణ సహాయ సమాచారాన్ని సేకరించనున్నారు. కాగా పీఎస్‌ఎల్వీ-సీ49 ప్రయోగం అనంతరం ఈఓఎస్‌-1 శాటిలైట్‌, 9 క‌స్ట‌మ‌ర్ శాటిలైట్లు కూడా నిర్దేశించిన కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడ్డాయని ఇస్రో ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ