ఆవిష్కరణలు భారీ స్థాయిలో పని చేసేలా చేయండి, విద్యార్థులకు ప్రధాని మోదీ సూచన

51st Convocation of IIT Delhi, Convocation of IIT Delhi, IIT Delhi, IIT Delhi 51st Convocation 2020, IIT Delhi Convocation, IIT Delhi Convocation 2020, IIT-Delhi 51st Convocation, IIT-Delhi 51st Convocation Live Updates, Narendra Modi Addressed at 51st Convocation of IIT Delhi, PM Modi, pm narendra modi

ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటి గ్రాడ్యుయేట్లను దేశ అవసరాలను గుర్తించి, స్థానికంగా వస్తున్న మార్పులతో కనెక్ట్ కావాలని కోరారు. ఆత్మ నిర్భర్ భారత్ నేపథ్యంలో సామాన్య ప్రజల ఆకాంక్షలను గుర్తించాలని కోరారు. ఈ రోజు ఢిల్లీ ఐఐటి 51 వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 2000 మందికి పైగా ఐఐటియన్లకు ప్రధాని అభినందనలు తెలిపారు. ఆత్మ నిర్భర్ కాంపెయిన్ దేశంలోని యువత, సాంకేతిక నిపుణులు మరియు టెక్-ఎంటర్ప్రైజ్ లీడర్స్ కు అవకాశాలను ఇచ్చే ఓ మిషన్ అని అన్నారు. సాంకేతిక నిపుణుల ఆలోచనలు మరియు ఆవిష్కరణలను స్వేచ్ఛగా అమలు చేయడానికి మరియు వాటిని సులభంగా మార్కెట్ చేయడానికి దేశంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ప్రధాని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ విద్యార్థులకు చెప్పిన నాలుగు సూత్రాలు:

ప్రధాని మోదీ విద్యార్థులకు వారి వర్క్ ప్లేస్ కు సంబంధించి నాలుగు సూత్రాలు చెప్పారు. “నాణ్యతపై దృష్టి పెట్టండి, ఎప్పుడూ రాజీపడకండి. స్కేలబిలిటీని నిర్ధారించుకోండి, మీ ఆవిష్కరణలు భారీ స్థాయిలో పని చేసేలా చేయండి. విశ్వసనీయతకు భరోసా ఇవ్వండి, మార్కెట్లో దీర్ఘకాలిక నమ్మకాన్ని పెంచుకోండి. అనుకూలత తీసుకురండి, అలాగే మార్పు విషయంలో ఎప్పుడూ సిద్ధంగా ఉండండి” ప్రధాని మోదీ సూచించారు. ఈ ప్రాథమిక సూత్రాలతో పనిచేయడం ద్వారా ప్రతిఒక్కరు ప్రత్యేక గుర్తింపుతో సాధించడంతో పాటుగా బ్రాండ్ ఇండియా కూడా వెలుగులోకి వస్తుందన్నారు. ఎందుకంటే విద్యార్థులు భారతదేశపు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లని, విద్యార్థుల కృషి దేశ ఉత్పత్తికి ప్రపంచ గుర్తింపును ఇస్తుందని, దేశ ప్రయత్నాలను వేగవంతం చేస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

దేశంలో 50 వేలకు పైగా స్టార్టప్‌లు ప్రారంభం:

కార్పొరేట్ పన్ను తక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం ముందు ఉందని ప్రధాని అన్నారు. స్టార్ట్-అప్ ఇండియా ప్రచారం ద్వారా దేశంలో 50 వేలకు పైగా స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయని, గత ఐదేళ్లలో దేశంలో పేటెంట్ల సంఖ్య 4 రెట్లు పెరగడం, ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్లలో 5 రెట్లు పెరుగుదల వచ్చిందన్నారు. సంవత్సరాలుగా 20 కి పైగా ఇండియన్ యునికార్న్లు స్థాపించబడ్డాయని, రాబోయే ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ప్రధాని తెలిపారు. స్టార్టప్‌ల నిధుల కోసం రూ.10 వేల కోట్ల కార్పస్‌తో ఫండ్‌ ఫండ్స్‌ రూపొందించామని ప్రధాని మోదీ చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eighteen =