బాబాకు విరాళం ఇవ్వాలంటే 10 రూపాయలు చాలట..

Recitation of Ramayana is eternal life 10 rupees is enough to donate to Baba,Recitation of Ramayana is eternal life,10 rupees is enough to donate to Baba,Ramayana is eternal life,Mango News,Mango News Telugu,Recitation of Ramayana,eternal life, 10 rupees donate to Baba,Siyaram Babas, ashram residing in Nimar, Madhya Pradesh, Teli Bhatyan Buzurg, Narmada river, Khargone district,Recitation of Ramayana News Today,Ramayana is eternal Latest News,Siyaram Baba Latest News
Recitation of Ramayana,eternal life, 10 rupees donate to Baba,Siyaram Baba's, ashram residing in Nimar, Madhya Pradesh, Teli Bhatyan Buzurg, Narmada river, Khargone district.

మన దేశంలో రుషులు, సాధువులను హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా గౌరవమిస్తారు.  కొన్ని చోట్ల వీరిని పూజిస్తూ ఉంటారు.ఇప్పటికే కూడా కొంతమంది  రుషులు, సాధువులు హిమాలయాల్లోనే కాలం గడుపుతూ ఉంటారని అంటూ  ఉంటారు. అంతేకాదు ఇలాంటివారిలో  చాలా మందికి అద్భుత శక్తులు ఉంటాయని చెబుతారు.

కానీ  కొందరు సాధువులు మాత్రం విలాసవంతమైన జీవనశైలిని గడుపుతూ.. సాధువులు ఇలా కూడా  ఉంటారా అని అందరినీ ఆశ్చర్యపోయేలా కనపిస్తుంటారు.  అయితే ఓ సాధువు మాత్రంత పరమాత్ముడికే తన జీవితం అంకితం అంటున్నారు. సాధారణ జీవితాన్ని గడుపుతూ.. డబ్బుపై దురాశ కానీ.. ఎవరితో అనుబంధం కానీ లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత పెద్ద స్థాయిలో వ్యక్తి  వచ్చినా.. సామాన్యుడు వచ్చినా వారిని ఒకేలా పలకరిస్తూ ఒకేలా మాట్లాడటం చూసి అక్కడివారు కూడా ఆశ్చర్యపోతారు.

ఈ సాధువు పేరు సెయింట్ సియారామ్ బాబా. మధ్యప్రదేశ్‌లోని నిమార్‌లో నివసిస్తున్నసియారామ్ బాబాను చూడటానికి మధ్యప్రదేశ్‌లోనే కాదు..  దేశవ్యాప్తంగా కూడా జనాలు వస్తుంటారు.  అతని ఆశ్రమం ఖర్గోన్ జిల్లా నుంచి  64 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్మదా నది ఒడ్డున తేలి భట్యాన్ బుజుర్గ్‌లో ఉంది. 90 ఏళ్ల వయసు గల సియారామ్ బాబా 50 ఏళ్లుగా నిత్యం రామాయణం పారాయణం చేస్తూనే ఉన్నారు. ఎంత చలిగా ఉన్నా, వేడి అయినా, చివరకు వాన వచ్చినా కూడా  ఏక వస్త్రంతోనే  ఆ బాబా  గడుపుతుంటారు.

మధ్యప్రదేశ్‌తో పాటు దేశంలోని నలుమూలల నుంచి వందలాది మంది రాకతో సియారామ్ బాబా ఆశ్రమం నిత్యం సందడిగా ఉంటుంది. అక్కడకు వచ్చినవాళ్లు బాబాకు వేలల్లో, లక్షల్లో  విరాళం ఇవ్వాలనుకున్నా కూడా వాటిని తిరస్కరించి..కేవలం పది రూపాయలు మాత్రమే తీసుకుంటారు సియారామ్ బాబా. సామాన్యులు ఎవరైనా 100 రూపాయల నోటు ఇస్తే, సియారామ్ బాబా అతనికి 90 రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు. అంతేకాదు కొంతమందికి  అతని దగ్గర ఉన్న డబ్బును కూడా పంచుతారు. బాబా స్నానం చేసి పూజించిన తర్వాత రోజంతా రామాయణం పారాయణం చేస్తూనే ఉంటారు.  వచ్చినవారికి తన చేతులతో ప్రసాదం పంచి స్వయంగా టీ తయారు చేసి వారికి ఇస్తారు.

నిజానికి  సియారామ్ బాబాది మధ్యప్రదేశ్ కాదట..బాబా గుజరాత్ వాసి అని స్థానికులు చెబుతుంటారు. 11వ తరగతి వరకు బొంబాయిలో చదివుకున్నారట. ఒకరోజు బాబా మనస్సులో పరిత్యాగము పుట్టి.. తన గురువు గారితో కలిసి 5 ఏళ్ల పాటు భారతదేశ పర్యటనకు వెళ్లాడు. అంతేకాదు సియారామ్ బాబా మానస సరోవర యాత్ర కూడా చేసారు. బాబాను సియారామ్ బాబా అని పిలుస్తారు కానీ.. నిజానికి బాబా  అసలు పేరు అలాగే  ఆయన గురూజీ గురించి ఎవరికీ తెలియదు. బాబా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఆయన తన సన్నిహిత సేవకులతో,  ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారితో మాత్రమే కాసేపే మాట్లాడతారు.మిగిలిన సమయమంతా రామాయణపారాయణంలోనే గడుపుతారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 7 =