జనరిక్ మందులను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాటు చేసిన ‘జన్ ఔషధి కేంద్రాల’ వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు లబ్ది పొందారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ‘జన్ ఔషధి దివస్’లో భాగంగా ప్రధాని మోదీ సోమవారం మాట్లాడుతూ.. దీని ద్వారా వారు సుమారు ₹13,000 కోట్లు వరకు ఆదా చేశారని అన్నారు. ‘జన్ ఔషధి దివస్’ సందర్భంగా ‘జన్ ఔషధి పరియోజన’ లబ్ధిదారులతో కూడా ప్రధాని మోదీ ఇంటరాక్ట్ అయ్యారు. ఫార్మాస్యూటికల్స్ శాఖ ప్రారంభించిన ‘ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన’ (PMBJP) పథకం కింద, ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన మందులను సరసమైన ధరలకే అందిస్తుండటం విశేషం.
జనరిక్ మందులను అందించడానికి PMBJP స్టోర్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్టోర్స్ లో మందులు తక్కువ ధరలకు లభిస్తాయి. అయితే, నాణ్యత మరియు సమర్థతలో ఇవి ఖరీదైన బ్రాండెడ్ మందులతో సమానంగా ఉంటాయి. జన్ ఔషధి కేంద్రాలు మందుల ధరలపై ప్రజల్లో భయాన్ని తగ్గించాయని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేడు దేశంలో 8,500కు పైగా జన్ ఔషధి కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కేంద్రాలు కేవలం ప్రభుత్వ దుకాణాలే కాకుండా సామాన్యులకు పరిష్కార కేంద్రాలుగా కూడా మారుతున్నాయని మోదీ అన్నారు. క్యాన్సర్, క్షయ, మధుమేహం మరియు గుండె జబ్బుల వంటి వ్యాధుల చికిత్సకు అవసరమైన 800 కంటే ఎక్కువ మందుల ధరలను తమ ప్రభుత్వం నియంత్రించిందని ప్రధాని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ





































