ర‌ష్య‌న్ అధ్య‌క్షుడు పుతిన్‌ తో మాట్లాడిన ప్రధాని మోదీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో నేరుగా చర్చించాలని సూచన

PM Modi Speaks with Russian President Vladimir Putin Discussed Evolving Situation in Ukraine, PM Modi Speaks with Russian President Vladimir Putin, PM Modi Discussed Evolving Situation in Ukraine, PM Modi Speaks With Ukraine President Volodymyr Zelensky Over Phone, Ukraine President Volodymyr Zelensky Over Phone, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, War Crisis, Ukraine News, Ukraine Crisis, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్‌ పై రష్యా సైనిక చర్య కొనసాగుతుంది. అలాగే ఉక్రెయిన్‌ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపు కూడా చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ సోమవారం నాడు ర‌ష్య‌న్ ఫెడ‌రేషన్ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఉక్రెయిన్, రష్యాల మధ్య చర్చల స్థితిగతులపై అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి వివరించారని తెలిపారు. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చలను ప్రధాని మోదీ స్వాగతించారు మరియు చర్చలు వివాద విరమణకు దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ప్రత్యక్ష సంభాషణ/చర్చలు జరిగితే జరుగుతున్న శాంతి ప్రయత్నాలకు గొప్పగా సహాయపడే అవకాశముందని ప్రధాని మోదీ సూచించారు. మరోవైపు సుమీలో ఇంకా మిగిలి ఉన్న భారతీయ విద్యార్థుల రక్షణ మరియు భద్రత పట్ల ప్రధాని మోదీ తన తీవ్ర ఆందోళనను తెలియజేశారు. భారతీయ విద్యార్థులతో సహా పౌరుల తరలింపును సులభతరం చేయడానికి మానవతా కారిడార్‌లకు సంబంధించి కొనసాగుతున్న చర్యల గురించి ఈ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి వివరించినట్టు తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =