జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 ఫలితాలు విడుదల, కౌన్సెలింగ్ రేపటి నుండే మొదలు

JEE Advanced 2020 Result Live Updates, JEE Advanced 2020 Results, JEE Advanced Result 2020, JEE advanced result 2020 announced, JEE Advanced Result 2020 declared, JEE Advanced Result 2020 declared LIVE Updates, JEE advanced results

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్-2020 ఫలితాలు సోమవారం నాడు విడుదల అయ్యాయి. దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 పరీక్షను సెప్టెంబర్ 27 న ఢిల్లీ ఐఐటీ దేశవ్యాప్తంగా నిర్వహించింది. కరోనా మహమ్మారి పరిస్థితుల మధ్యలో కూడా దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఫలితాలను jeeadv.ac.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఈ పరీక్షకు సంబంధించి స్కోర్ ‌కార్డులతో పాటుగా ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ ను కూడా ఢిల్లీ ఐఐటీ విడుదల చేసింది. ఈ ర్యాంకుల ఆధారంగా మొత్తం 23 ఐఐటీల్లో సుమారు 11,279 సీట్లను భర్తీ చేయనున్నారు. మరోవైపు జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 కౌన్సెలింగ్ మరియు సీట్ల కేటాయింపు నమోదు ప్రక్రియ అక్టోబర్ 6 నుండి ప్రారంభం కానుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu