కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడియూరప్ప ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ద్వితీయ కుమార్తె పద్మావతి కూతురు సౌందర్య (30). ఈ రోజు ఉదయం సౌందర్యను బెంగళూరు లోని ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు వేలాడుతున్న స్థితిలో గుర్తించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన బీఎస్. యడియూరప్ప ఇటీవల కాలంలో ఆయన కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న సౌందర్య, ఆమె భర్త బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో డాక్టర్లుగా పని చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం సౌందర్య భర్త నీరజ్ డ్యూటీకి వెళ్లిన సమయంలో నెలల వయసున్న పసిబిడ్డ, ఇంకా పనిమనిషి ఇంట్లోనే ఉన్నారు. భర్త బయటకు వెళ్లిన తర్వాత సౌందర్య తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. టిఫిన్ అందించేందుకు పనిమనిషి వెళ్లి డోర్ కొట్టగా.. ఎంతకూ డోర్ తీయకపోవడంతో ఆమె నీరజ్ కు ఫోన్ చేసింది. ఆటను ఇంటికి వచ్చి తలుపు బద్దలు కొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోస్టుమార్టం అనంతరం సౌందర్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, దంపతులిద్దరి మధ్య గొడవలేమీ లేవని.. సౌందర్య పోస్ట్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో యడియూరప్ప కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ