దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు

2022, Centre Extends Coronavirus Guidelines, Centre extends COVID-19 guidelines till February 28, Covid curbs extended till Feb 28 as positivity rate, COVID-19, COVID-19 guidelines t, Mango News, MHA extends containment measures, MHA Extends Existing Covid-19 Guidelines, MHA Extends Existing Covid-19 Guidelines in the Country, MHA Extends Existing Covid-19 Guidelines in the Country Till February 28, MHA Extends Existing Covid-19 Guidelines in the Country Till February 28 2022, Ministry of Home Affairs, Ministry of Home Affairs extends COVID-19 guidelines

దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల, కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న కోవిడ్ నియంత్రణ చర్యలు/నిబంధనల అమలును ఫిబ్రవరి 28, 2022 వ‌ర‌కు పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖ రాశారు.

జిల్లా/స్థానిక స్థాయిల్లో పరిస్థితుల ఆధారంగా కోవిడ్-19 నియంత్రణ చర్యలను తీసుకోవడానికి నియమావళి ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ఉండేలా చూసేందుకు విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద డిసెంబర్ 27న జారీ చేసిన నిబంధనలను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తునట్టు పేర్కొన్నారు. నిబంధనలు ప్రకారం కోవిడ్ నియంత్రణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే డిసెంబర్ 21న కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖ రాసి చేసిన పలు కీలక సూచనలను కూడా ఫిబ్రవరి 28 వరకు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 15 =