టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం‌ ఉంటే రేషన్ ‌కార్డు వదులుకోవాల్సిందే!

#Karnataka, BPL Cards, BPL ration card, Karnataka BPL card, Karnataka BPL card holders, Karnataka Government, Karnataka Government Takes Key Decision, Karnataka Government Takes Key Decision over BPL Cards, Karnataka News, Karnataka Political updates, Mango News

రేషన్‌ కార్డుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనం, టీవీ, ఫ్రిజ్ లేదా ఐదు ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్నవారు రేషన్ కార్డులను (బిపిఎల్ కార్డులు) కలిగి ఉంటే, వారి కార్డులను మార్చి 31 లోగా ప్రభుత్వానికి అప్పగించాలని కోరింది. లేకుంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. కర్ణాటక పౌర సరఫరాల మంత్రి ఉమేష్ కత్తి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బిపిఎల్ కార్డును కలిగి ఉండటానికి కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. నియమాల ప్రకారం ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి, ఏటా రూ.1.20 లక్షల ఆదాయం, మోటారుసైకిల్, టీవీ లేదా ఫ్రిజ్ ఉండకూడదు. ఇవి కలిగిఉన్నవారు మార్చి 31 లోపు రేషన్ కార్డును వదులుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఉన్నత వర్గాల వారు కూడా రేషన్‌ కార్డులను ఉపయోగించుకున్నారని, దీని వలన అర్హత కలిగిన వారికీ సరుకులు అందడం లేదని పేర్కొన్నారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెంగళూరు సహా కర్ణాటకలోని పలు జిల్లాలలో వివిధ రేషన్ షాపుల ముందు నిరసనలు వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ