గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి కరోనా పాజిటివ్

Gujarat Chief Minister Vijay Rupani Tests Positive for Covid-19,Mango News,Mango News Telugu,Gujarat CM tests positive for Covid day after he collapses on stage,Day after fainting mid-speech Gujarat CM Vijay Rupani tests positive for Covid-19,Gujarat CM Vijay Rupani tests positive for Covid-19,Gujarat CM Vijay Rupani tests positive for COVID-19 admitted to hospital,Day After Fainting at Vadodara Rally Gujarat Chief Minister Vijay Rupani Tests Positive for Covid-19,Gujarat Chief Minister Vijay Rupani tests positive for COVID-19,Gujarat Chief Minister Vijay Rupani tests positive for coronavirus,Gujarat Chief Minister Vijay Rupani tests positive for COVID

దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందుగా ఆదివారం నాడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వడోదరలో నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా సీఎం విజయ్ రూపానీ అస్వసతకు గురయ్యారు. వేదికపైనే ఒక్కసారిగా కుప్పకూలారు. అనంతరం ఆయనకు ప్రథమ చికిత్స అందించి చికిత్స నిమిత్తం అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితం పాజిటివ్ గా వచ్చింది. ఆయనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి సీఎం విజయ రూపానీ ఆరోగ్యం గురించి వాకబు చేసినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here