పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: వేర్వేరు సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభ, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

2022 Parliament Budget session, Budget Session, Budget Session-2022, Mango News, Parliament Budget Session, parliament budget session highlights, Parliament Budget Session News, Parliament to Function in Two Shifts, Parliament to function in two shifts due to COVID-19, Parliament to Function in Two Shifts Due to Covid-19 Situation, Parliament to Run in Shifts for Budget Session

పార్లమెంటు బడ్జెట్-2022 సమావేశాలు జనవరి 31, సోమవారం నాడు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండు విడతలుగా జరగనుంది. మొదటి విడతలో జనవరి 31 నుండి ఫిబ్రవరి 11 వరకు మరియు రెండో విడతలో మార్చి 14 నుండి ఏప్రిల్ 8 వరకు జరగనుంది. ముందుగా జనవరి 31న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంట్ షిఫ్ట్‌ల వారీగా పనిచేయనుంది.

లోక్‌సభ, రాజ్యసభ వేర్వేరు సమయాల్లో జరగనున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్-2022 ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం కానుంది. ఈ మేరకు సోమవారం నాడు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక రాజ్యసభ సమావేశాల సమయాన్ని చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయించనున్నారు. వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. దీంతో రాజ్యసభ సమయాలపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. మరోవైపు కరోనా నిబంధనలను అనుసరించి పార్లమెంటులో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్ షిఫ్టులు వారీగా పనిచేయనుండడంతో సభ్యుల సిట్టింగ్ కోసం భౌతిక దూరం పాటించేలా లోక్‌సభ, రాజ్యసభ మరియు గ్యాలరీలను కూడా ఉపయోగించనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 18 =