జికా వైరస్‌ : కేరళ రాష్ట్రంలో 19 కి చేరిన కేసులు సంఖ్య

diagnosis of zika virus, Kerala Health Minister Veena George, Kerala Zika virus, Total Number of Cases in Kerala State Increased to 19, Zika virus, zika virus and pregnancy, zika virus deaths, zika virus in india, Zika virus in Kerala, Zika virus infection, zika virus is spread by, zika virus symptoms and treatment, Zika Virus Treatment

కేరళ రాష్ట్రంలో ఓవైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండగా, మరోవైపు జికా వైరస్‌ కేసులు కూడా పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇప్పటివరకు జికా వైరస్‌ కేసుల సంఖ్య 19 కు చేరినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. సోమవారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు జికా వైరస్‌ లక్షణాలు ఉండడంతో, ఆమె శాంపిల్స్ ను కోయంబత్తూరుకు చెందిన ల్యాబ్ కు పంపించగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. ఆదివారం నాడు ముగ్గురికి, సోమవారం నాడు ఒకరికి జికా వైరస్ పాజిటివ్ గా రావడంతో మొత్తం కేసుల సంఖ్య 19కి పెరిగినట్టు చెప్పారు. మరోవైపు అలప్పుజాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీకి (ఎన్‌ఐవీ) పంపించిన 5 శాంపిల్స్ నెగటివ్‌ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు.

జికా వైరస్ కేసుల పెరుగుదలపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, ఈ వైరస్‌ నివారణకు ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. తిరువనంతపురం, త్రిస్సూర్ మరియు కోజికోడ్ మెడికల్ కాలేజీలలో మరియు అలప్పుజాలోని ఎన్‌ఐవీలో జికా వైరస్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 2,100 టెస్ట్ కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అలాగే జ్వరం, దద్దుర్లు, ఒంటినొప్పితో బాధపడుతున్న బాధితులకు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆసుపత్రులకు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 15 =