మద్యం మత్తులో మందుబాబులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారి తీరు నవ్వు తెప్పిస్తే.. కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక కొందరైతే పీకల్దాక తాగి ఒళ్లు మరచి రెచ్చిపోతుంటారు. తామేం చేస్తున్నామో కూడా సోయ ఉండదు. మరోవైపు మద్యం సేవించి వాహనాలు నడపొద్దు.. ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దు అని అధికారులు, పోలీసులు చెబుతూనే ఉంటారు. అయినా మందు బాబులకి మాత్రం అవేం చెవికెక్కవు. ఫుల్లుగా తాగి వాహనాలు డ్రైవ్ చేసి ప్రమాదాలకు కారణమవుతున్నారు.
తాజాగా ఓ మందుబాబు ఫుల్లుగా మద్యం సేవించి.. కారును రైల్వే ట్రాక్‌పై నడిపాడు. ట్రాక్‌ను తన ఇంటికి అడ్డరోడ్డుగా భావించి దానిపై నుంచి పోనిచ్చాడు. ఈ సంఘటన ఒకింత ఆశ్చర్యానికి గురిచేసినా.. ఇది మాత్రం నిజంగానే జరిగింది.
కేరళలోని కన్నూరుకు చెందిన జయప్రకాశన్.. జులై 18 రాత్రి ఫుల్లుగా మద్యం సేవించాడు. అనంతరం కారులో ఇంటికి బయలుదేరిన అతడు.. నగరం లోపల ఉన్న రైల్వే ట్రాక్‌కు దగ్గరకు వచ్చేటప్పటికి పొరబడ్డాడు. దానిని షార్ట్‌కట్ దారి అనుకుని.. రైల్వేట్రాక్ పైకి కారు ఎక్కించాడు. మద్యం మత్తులో కారును అలాగే కొన్ని మీటర్ల దూరం ట్రాక్‌పై నడిపాడు. తర్వాత వాహనం పట్టాలపై ఇరుక్కుపోయింది. దీనిని గమనించి రైల్వే గేట్‌కీపర్, స్థానికులు అక్కడకు చేరుకుని.. సమీప రైల్వేస్టేషన్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతణ్ని అరెస్టు చేసి, కారును సీజ్ చేశారు. నిందితుడు మద్యం మత్తులో ట్రాక్‌ను రోడ్డుగా పొరబడ్డాడని పోలీసులు తెలిపారు. అయితే, పట్టాలపై కారు ఉన్న సమయంలో అటుగా రైళ్లు రాకపోవడంతో పెను ముప్పు తప్పింది. ఈ దృశ్యాలను అక్కడున్నవారు తమ మొబైల్ ఫోన్‌లో బంధించి.. వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఇక స్థానికుల సాయంతో పోలీసులు కారును ట్రాక్‌పై నుంచి తొలగించారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE