అస్సాం పర్యటనలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.. ఖాజిరంగా పార్కులో ‘గ‌జ ఉత్స‌వ్‌’ ప్రారంభం

President Droupadi Murmu Inaugurates Two-Day Gaj Utsav at Kaziranga National Park in Assam,President Droupadi Murmu Inaugurates Two-Day Gaj Utsav,Two-Day Gaj Utsav at Kaziranga National Park,Two-Day Gaj Utsav in Assam,Mango News,Mango News Telgu,President Droupadi Murmu Latest News,President Murmu's 2nd day in Assam,Gaj Utsav 2023,Gaj Utsav 2023 Latest News,Prez Murmu Takes Jeep Safari,President takes jeep safari inside Kaziranga,Gaj Utsav at Kaziranga Live News

రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము అస్సాంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె శుక్రవారం ఖాజిరంగా నేషనల్ పార్క్ హైస్కూల్ ప్లేగ్రౌండ్‌లో రెండు రోజుల పాటు జరిగే ‘గజ్ ఉత్సవ్-2023’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఈరోజు గౌహ‌తిలో జ‌రిగే మరికొన్ని కార్య‌క్ర‌మాల్లో కూడా ద్రౌప‌ది ముర్ము పాల్గొంటారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం గౌహతి హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకలకు కూడా హాజరుకానున్నారు. అనంతరం మౌంట్ కాంచెన్ గంగా ఎక్స్‌పెడిష‌న్‌ను ప్రారంభిస్తారు. ఇక శ‌నివారం తేజ్‌పూర్ ఎయిర్స్ ఫోర్స్ స్టేష‌న్ నుంచి సుఖోయ్ 30 ఎంకేఐ విమానంలో కొద్దిసేపు విహరించనున్నారు.

కాగా రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కోహోరాలో అస్సామీ కళాకారులచే బోర్తాల్, ఝుమూర్ మరియు బిహు నృత్య రూపాలతో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించారు. అలాగే పలువురు విద్యార్థులు రాష్ట్రపతితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఇక ఈ కార్యక్రమానికి అస్సాం గవర్నర్ గులాబ్ చాంద్ క‌టారియా మరియు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మలు హాజరయ్యారు. ఖాజిరంగా పార్కులో ‘గ‌జ ఉత్స‌వ్‌’ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం రాష్ట్ర‌ప‌తి ముర్ము జీపు స‌ఫారీ చేశారు. రైనోల‌కు ఫేమ‌స్ అయిన ఈ పార్కులో ఆమె కొద్దిసేపు ఉల్లాసంగా గ‌డిపారు. మిహిముక్ పాయింట్ నుంచి పార్క్‌లోకి ఎంట‌రైన ద్రౌప‌ది ముర్ము, అడ‌విలో ఉన్న ఖ‌డ్గ మృగాలు, ప‌క్షులు, జింక‌లు, వ‌న్య ప్రాణుల్ని దగ్గరనుంచి తిలకించారు. అలాగే పార్క్‌లో ఉన్న ఏనుగుల‌కు రాష్ట్ర‌ప‌తి స్వహస్తాలతో ఫీడింగ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =