వాట్సాప్ కాల్స్ చేసే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి అద్భుతమైన ఫీచర్‌

WhatsApp Brings New Feature That To Initiate Group Calls With up to 15 People,WhatsApp Brings New Feature,New Feature That To Initiate Group Calls,Group Calls With up to 15 People,WhatsApp New Feature,WhatsApp Group Calls With up to 15 People,WhatsApp Initiate Group Calls,Mango News,Mango News Telugu,Whats App, Whats App Update, Whats App New Feature, Whats App latest Update, Whats App Custmors,WhatsApp Latest News,WhatsApp Latest Updates,WhatsApp New Feature News Today,WhatsApp New Feature Latest Updates

వాట్సాప్ కాల్స్ చేసే వారికి గుడ్ న్యూస్ అందించింది వాట్సాప్. అందుబాటులోకి మరో అద్భుతమైన ఫీచర్‌ తీసుకు వస్తోంది. మెటా నుంచి వచ్చిన ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ అంటేనే విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ప్రపంచంలోనే ఎక్కువ మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్‌‌లలో వాట్సాప్ ఫస్ట్ ప్లేసులో సెటిలయిపోయింది.

జనాల్లో ఉన్న ఆదరణను వదులుకోవడానికి వాట్సాప్ అస్సలు సిద్ధంగా ఉండదు. ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలను గుర్తించడంలోనే కాదు.. కొత్త కొత్త ఫీచర్స్ , అప్ డేట్లతో తమ కస్టమర్లను ఆకట్టుకోవడంలో వాట్సాప్ ఎప్పుడూ చాలా ముందుంటుంది. అదే ఊపుతో ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ కాలింగ్‌లో మరో సరికొత్త అప్ డేట్‌ను యూజర్లకు అందించింది. గ్రూప్ కాల్ చేసుకునే లిమిట్‌ను పెంచి వాట్సాప్ వినియోగదారులకు పెద్ద శుభవార్తనే తీసుకువచ్చింది. దీని ప్రకారం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ కాలింగ్‌లో ఒకేసారి 15 మందితో ప్రారంభంలోనే మాట్లాడొచ్చు. అంటే ఇప్పుడున్న సంఖ్యను డబుల్‌కు పెంచిందన్నమాట.

గతేడాది ప్రవేశపెట్టిన అప్ డేట్ ప్రకారం.. వాట్సాప్ గ్రూప్ కాల్‌లో మొత్తం 32 మంది పాల్గొనేలా అవకాశం ఉండేది. అయితే కాల్ ప్రారంభంలో మాత్రం ఏడుగురు మాత్రమే ఉండగలరని.. మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ అప్లికేషన్‌నే అప్ గ్రేడ్ చేసి.. వాట్సాప్ గ్రూప్ కాల్ స్టార్టింగ్ లోనే 15 మంది వరకూ పాల్గొనే అవకాశాన్ని కల్పించింది వాట్సాప్. సరికొత్త బీటా వెర్షన్ 2.23.15.14 వెర్షన్‌లో.. ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

వాట్సాప్ బీటా ఇన్ ఫో చెబుతున్న దాని ప్రకారం.. నవంబర్‌ 2022లో తొలిసారి ఈ టెక్నాలజీ గురించి మార్క్ జుకర్ బర్గ్ వివరించారు. అప్పుడు గ్రూప్ కాల్ 32 మందితో ఒకేసారి మాట్లాడవచ్చని చెప్పిన జుకర్ బర్గ్.. కాల్ ప్రారంభమయ్యేది మాత్రం ఏడుగురితోనే అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ సంఖ్యను 15 మందికి పెంచినట్లు వాట్సాప్ తెలిపింది. అంటే వాట్సాప్ గ్రూప్ కాల్‌ను 15 మందితో ప్రారంభించి.. దానిలో 32 మంది వరకూ యాడ్ అయ్యే అవకాశం ఉంటుందన్న మాట. ఇది గ్రూప్ కాల్స్‌ను మరింత కన్వీనెంట్‌గా మార్చేస్తుందని బీటా ఇన్ ఫో చెబుతోంది.

అయితే ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కొంతమంది బీటా వెర్షన్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంచారు. త్వరలోనే పూర్తిస్థాయిలో వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకే వాట్పాప్ వినియోగదారులంతా తమ తమ యాప్‌ని రెగ్యులర్‌గా అప్ డేట్ చేసుకోవాలని వాట్సాప్ చెబుతోంది. దీని వల్ల అప్ డేట్ అవడమే కాకుండా.. అకౌంట్ కూడా సెక్యూర్డ్‌గా ఉంటుందని తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 10 =