బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని పదవీ చేపట్టిన కేవలం 45 రోజులకే ఆమె రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానిగా ఉన్న నేతగా లిజ్ ట్రస్ నిలిచారు. బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన అనంతరం తదుపరి బ్రిటన్ ప్రధాని కోసం జరిగిన ఎన్నికల్లో భారత సంతతి నేత, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ పై లిజ్ ట్రస్ విజయం సాధించారు. కాగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె చేపట్టిన ఆర్థిక కార్యక్రమం/మినీ బడ్జెట్ బ్రిటన్ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దకపోగా మార్కెట్లకు షాక్‌వేవ్‌లను పంపింది, దీంతో ఆమె కన్జర్వేటివ్ పార్టీలో కూడా విబేధాలు మొదలయ్యాయి. ఆమె ప్రభుత్వంలోని నలుగురు సీనియర్ మంత్రుల్లో ఇద్దరు ఇప్పటికే రాజీనామా చేశారు.
ఆమె విధానాలు విమర్శలకు గురవడం, ఈ క్రమంలో ఒత్తిడి పెరగడంతో లిజ్ ట్రస్ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా అనంతరం తన నంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం ఎదుట లిజ్ ట్రస్ మాట్లాడుతూ, కన్జర్వేటివ్ నేతగా పోటీ చేసినపుడు తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోయానని, పార్టీ విశ్వాసాన్ని కోల్పోయానని అంగీకరించింది. తన రాజీనామా విషయాన్ని బ్రిటన్ కింగ్ కు తెలిపానని, నూతన ప్రధానిని ఎన్నుకునేవరకు పదవిలో కొనసాగనున్నట్టు లిజ్ ట్రస్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY