దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 12న నీట్‌ (యూజీ)-2021 పరీక్ష నిర్వహణ

Mango News, NEET 2021, NEET 2021 Latest News, NEET UG, NEET UG 2021, NEET UG 2021 Entrance Exam, NEET UG 2021 Entrance Exam Date, NEET UG 2021 Entrance Exam News, NEET UG 2021 Entrance Exam will be held on 12th September, NEET UG 2021 exam, NEET UG 2021 exam date, NEET UG 2021 exam date announced, NTA NEET 2021, NTA NEET 2021 entrance exam

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆగస్టు 1, 2021 న జరగాల్సిన నీట్‌ (యూజీ)-2021 పరీక్షను కేంద్రప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్‌ (యూజీ)-2021 పరీక్ష నిర్వహణ కొత్త తేదీని ఖరారు చేస్తూ కేంద్ర విద్యా శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 ప్రోటోకాల్‌ లను అనుసరించి దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 12న నీట్‌ పరీక్షను నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం నాడు ప్రకటించారు. దరఖాస్తు ప్రక్రియ జూలై 13, మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి ఎన్‌టిఎ వెబ్‌సైట్స్ ద్వారా ప్రారంభమవుతుందని చెప్పారు.

భౌతిక దూర ప్రమాణాలకు అనుగుణంగా, ఈ పరీక్ష నిర్వహించబడే నగరాల సంఖ్యను 155 నుండి 198కి పెంచామని చెప్పారు. అలాగే 2020లో 3862 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించగా, ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా పెంచబోతున్నట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద కోవిడ్ ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండేలా, అభ్యర్థులందరికీ ఫేస్ మాస్క్ అందించబడుతుందని, కాంటాక్ట్‌లెస్ రిజిస్ట్రేషన్, శానిటైజేషన్, భౌతిక దూరంతో కూర్చునేలా ఏర్పాట్లు చేయబడతాయని పేర్కొన్నారు. ఈ నీట్ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 18 =