రాత్రి పూట కర్ఫ్యూపై రాష్ట్రాలకు కేంద్ర హోమ్ శాఖ సూచనలు

MHA Says Truck, Bus Movement Exempted from the Night Curfew

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా రాత్రి వేళలో కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే రాత్రిపూట కర్ఫ్యూ అమలుపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొన్ని సూచనలు చేస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా జూన్ 12, శుక్రవారం నాడు లేఖ రాశారు. రాత్రి సమయంలో గుంపులు గుంపులుగా తిరిగే వారిని, సమూహంగా వెళ్లే వారిని ఆపేందుకు, అనవసర కార్యకలాపాల నివారణకే కర్ఫ్యూని విధించామని లేఖలో పేర్కొన్నారు. కాగా సరుకు రవాణా చేసే వాహనాలు, బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా ప్రయాణాలు కొనసాగిచే వారికి ఈ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉందని లేఖలో స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu