పార్లమెంట్‌లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. నిప్పులు చెరుగుకునే ఆ ఇద్దరు నేతలు ఆప్యాయంగా కరచాలనం చేసుకున్నారు. బుధవారం లోక్ సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు ఓం బిర్లాకు అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన్ను పోడియం వద్దకు తీసుకెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే స్పీకర్ ఓం బిర్లాను అభినందించే సమయంలో రాహుల్ గాంధీ, ప్రధాని మోడీలు ఆప్యాయంగా కరచలనం చేసుకున్నారు. అయితే రాహుల్ గాంధీ, మోడీ కరచాలనం చేసుకోవడం చూసి సభ్యులంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వీరు.. కరచాలనం చేసుకోవడం ఏంటని షాక్ అయ్యారు.
ఇకపోతే వరుసగా రెండసారి లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎంపిక కావడంపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. రాబోయే అయిదేళ్ల స్పీకర్ మార్గనిర్దేశంలో ముందుకు వెళ్తామని వెల్లడించారు. సభ ప్రజల అంచనాలకు అనుగుణంగా నడిచేలా చూడడంలో ఓం బిర్లా కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. అలాగే ఓం బిర్ల మధురమైన చిరునవ్వు సభ మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుందని ప్రశంసించారు. 70 ఏళ్ల స్వాతంత్ర్యంలో జరగని కొన్ని పనులు ఓం బిర్లా అధ్యక్షతన ఈ సభో సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. అత్యంత కీలకమైన బిల్లులు ఓం బిర్లా నాయకత్వంలో ఆమోదం పొందాయని, ప్రజాస్వామ్య సుదీర్ఘ ప్రయాణంలో అనేక మైలురాళ్లు వచ్చాయని మోడీ వెల్లడించారు.
ఇక గాంధీ కుటుంబం నంచి ప్రతిపక్ష నేతగా ఎన్నికైన మూడో నేతగా రాహుల్ గాంధీ నిలిచారు. ఇప్పటి వరకు గాంధీ కుటుంబం నుంచి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు ప్రతిపక్ష నేతగా పని చేశారు. ఇక రెండోసారి స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయినందున.. ఆయన్ను ప్రతిపక్షాలు, ఇండియా కూటమి తరుపున రాహుల్ గాంధీ అభినందించారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వం సహకరించాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును అణచివేడం అప్రజాస్వామికం అన్న రాహుల్ గాంధీ.. ప్రతిపక్షం ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చశారు. ప్రజల గొంతుకకు మధ్యవర్తి స్పీకర్ అని.. ప్రతిపక్షాలను సభలో మాట్లాడేందుకు అనుమతిస్తారనే నమ్మకం తనకు ఉందని రాహుల్ గాంధీ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE