ఆఫ్రికా లోని దక్షిణ సూడాన్ లో ఒక అంతుచిక్కని వ్యాధి అక్కడి ప్రజలకు కంటిపైన కునుకు లేకుండా చేస్తోంది. అంతుచిక్కని వ్యాధితో ఇప్పటివరకు 100 మంది మరణించారని అక్కడి అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా, కొన్ని వందల మంది అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. ఈ మిస్టరీ వ్యాధి దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖను కలవరపెట్టిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) టాస్క్ ఫోర్స్ దక్షిణ సూడాన్‌కు పంపబడింది. ఈ వ్యాధి దక్షిణ సూడాన్‌లోని జోంగ్లీ రాష్ట్రంలోని ఫంగాక్‌లో దాదాపు 100 మంది మృతికి కారణమయింది. స్థానిక అధికారుల దగ్గరున్న రిపోర్టుల ప్రకారం, వ్యాధిగ్రస్తుల ప్రాథమిక నమూనాలు కలరాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
WHO తరపున షీలా బయా BBCతో మాట్లాడుతూ, “మేము ఒక వేగవంతమైన ప్రతిస్పందన బృందాన్ని పంపాలని నిర్ణయించుకున్నాము. అప్పుడే వారు అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల నుండి నమూనాలను సేకరించగలుగుతారు. ఇప్పటివరకు తాత్కాలికంగా మాకు లభించిన వివరాల ప్రకారం 100 మరణాలు సంభవించాయి. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. వేలాదిమంది అనారోగ్యం పాలయ్యారు” అని తెలియజేసారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో తీవ్ర వరదలు ఉండటం మూలాన శాస్త్రవేత్తల బృందం హెలికాప్టర్ ద్వారా ఫంగాక్ చేరుకోవాల్సి ఉందని బయా వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ