భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం 1971 యుద్ధం – రాజ్ నాథ్ సింగ్

#Vijay Diwas, 1971 Indo-Pak War, Defence Minister And Other Political Leaders Remember Indian Warriors On Swarnim Vijay Diwas, Kargil Vijay Diwas News, Kargil Vijay Diwas Updates, Mango News, PM Modi, PM Modi At War Memorial To Mark Victory, PM Modi At War Memorial To Mark Victory In 1971, PM Modi At War Memorial To Mark Victory In 1971 Indo-Pak War, Political Leaders Remember Indian Warriors On Swarnim Vijay Diwas, Swarnim Vijay Diwas, Vijay Diwas 2021, Vijay Diwas Pay Tribute To Soldiers From 1971 Indo-Pak War

స్వర్ణిమ్ విజయ్ దివస్ సందర్భంగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నాడు 1971 యుద్ధంలో సాయుధ బలగాల ధైర్యాన్ని మరియు త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది భారతదేశ సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. ట్విటర్‌లో రక్షణ మంత్రి మాట్లాడుతూ, ‘స్వర్ణిమ్ విజయ్ దివస్’ సందర్భంగా, 1971 యుద్ధంలో మన సాయుధ బలగాల ధైర్యాన్ని మరియు త్యాగాన్ని గుర్తుచేసుకుందాము. 1971 యుద్ధం. భారతదేశ సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. మేము గర్విస్తున్నాము. మన సాయుధ దళాలు మరియు వారి విజయాలు చరిత్రాత్మకం.

రాజ్‌నాథ్ సింగ్ “ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్” అను ఒక ఫోటోను షేర్ చేసారు. 1971 యుద్ధంలో భారతదేశం విజయం సాధించి 50 సంవత్సరాలైన జ్ఞాపకార్థం మరియు బంగ్లాదేశ్ ఏర్పాటుకు ఇది ప్రతిరూపం అని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధం భారత్-పాకిస్తాన్ మధ్య జరుగగా భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ నుంచి విముక్తి లభించి స్వతంత్ర దేశంగా గుర్తించబడింది.

గత ఏడాది డిసెంబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద శాశ్వత జ్వాల నుండి స్వర్ణిమ్ విజయ్ జ్యోతులను వెలిగించారు. ఈ జ్యోతులు కీలకమైన యుద్ధ ప్రాంతాలకు మరియు 1971 యుద్ధంలో గ్యాలంట్రీ అవార్డు విజేతలు మరియు అనుభవజ్ఞుల ఇళ్లకు కూడా తీసుకెళ్లబడ్డాయి. ఈరోజు నివాళులర్పించే కార్యక్రమంలో ఈ నాలుగు జ్వాలలను ప్రధానమంత్రి జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద శాశ్వత జ్వాలతో విలీనం చేస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eight =