2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు మార్చి 3, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలని కోరుతూ నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ వేసిన పిటిషన్ పై మార్చ్ 2, సోమవారం నాడు ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఉరిశిక్ష అమలుపై స్టే విధించేది లేదని తేల్చి చెబుతూ, అక్షయ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మరోవైపు తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా పెట్టుకున్న పిటిషన్‌ను కూడా ఈ రోజు సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టి వేసింది.
అయితే పవన్ గుప్తా మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. ఈ అంశంపై ఢిల్లీ కోర్టులో ఈ రోజు సాయంత్రం కల్లా విచారణ జరగనుంది. క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించే అవకాశమే ఎక్కువ ఉండడంతో, నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై కొనసాగుతున్న ఉత్కంఠ పూర్తిగా తొలిగిపోనుంది. ఇక నిర్భయ దోషులను రేపు ఉదయం 6 గంటలకు ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
[subscribe]