జింబాబ్వే మాజీ కెప్టెన్‌ టేలర్‌పై ఐసీసీ నిషేధం

Brendan Taylor, Brendan Taylor Banned By ICC, Brendon Taylor Former Zimbabwe Captain, Brendon Taylor Former Zimbabwe Captain Banned By ICC, Brendon Taylor Former Zimbabwe Captain Banned By ICC For Three and Half Years, former Zimbabwe captain, Former Zimbabwe Captain Brendan Taylor, Former Zimbabwe Captain Brendan Taylor Banned By ICC, Mango News, Taylor banned for 3 and half years for delay in reporting spot, Zimbabwe Captain

జింబాబ్వే మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మూడున్నరేళ్లు నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించినట్లు తేలింది. దీంతో ఐసీసీ అతనిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి జింబాబ్వే తరఫున 2004 నుంచి 2021 వరకు 284 మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 9,938 పరుగులు చేశాడు. వాటిలో 17 సెంచరీలు ఉన్నాయి. కాగా, 35 ఏళ్ల బ్రెండన్‌ టేలర్‌ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

అయితే, బ్రెండన్ టేలర్ ఇటీవలే సంచలన విషయాలు వెల్లడించాడు. గతంలో ఓ భారత వ్యాపారవేత్త క్రికెట్ లీగ్ పై చర్చించేందుకు భారత్ రావాలని కోరాడని, తాను వెళితే డ్రగ్స్ తో పార్టీ ఇచ్చి, తాను డ్రగ్స్ తీసుకున్నప్పటి వీడియోతో బ్లాక్ మెయిల్ చేశాడని టేలర్ తెలిపాడు. ఫిక్సింగ్ కు పాల్పడాలంటూ తనకు 15 వేల డాలర్లు కూడా ఇచ్చారని వెల్లడించాడు. అయితే ఈ సమాచారాన్ని తమతో వెంటనే పంచుకోలేదంటూ ఐసీసీ బ్రెండన్ టేలర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా తన తప్పిదాలను జింబాబ్వే మాజీ కెప్టెన్‌ అంగీకరించాడని ఐసీసీ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here