మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) 26 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాన్రాడ్ సంగ్మా మార్చి 7న మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మేఘాలయలో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ/కూటమికీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, ఎన్‌పీపీకి బీజేపీ ఇప్పటికే తన మద్దతును అందించింది. అలాగే మరికొందరు కూడా తమ మద్దతు తెలిపినట్టు తెలుస్తుంది. దీంతో మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.
ముందుగా శుక్రవారం ఉదయం కాన్రాడ్ సంగ్మా మేఘాలయ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన రాజీనామా లేఖను గవర్నర్ ఫాగు చౌహాన్ కు సమర్పించారు, అలాగే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తమకు 32 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణ మెజారిటీ ఉందని, మేఘాలయలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గవర్నర్ ఫాగు చౌహాన్ సీఎం కాన్రాడ్ సగ్మా రాజీనామాను ఆమోదించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు పదవిలో కొనసాగాలని సూచించారు.
మేఘాలయలో మొత్తం 60 స్థానాలకు గానూ 59 చోట్ల పోలింగ్ జరగగా, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) 26 స్థానాల్లో, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో, టీఎంసీ 5 స్థానాల్లో, వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ 4 స్థానాల్లో, బీజేపీ 2, హెచ్ఎస్పీడీపీ 2, పీడీఎఫ్ 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు. కాన్రాడ్ సంగ్మా సౌత్ తురా నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి బెర్నార్డ్ మారక్ పై 3,251 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలోనే మేఘాలయలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కాన్రాడ్ సంగ్మా అడుగులు వేస్తున్నారు. సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE