పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై, స్పందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

Governor Tamilisai Responds Over Telangana Govt Files Pill In Supreme Court Regarding Pending Bills,Governor Tamilisai Responds Over Telangana Govt,Telangana Govt Files Pill In Supreme Court,Telangana Govt Regarding Pending Bills,Mango News,Mango News Telugu,Telangana Moves Supreme Court,Telangana Govt Drags Governor Tamilisai,State Govt Files Petition In Supreme Court,Ts Govt Petition In Supreme Court ,Cm Kcr Govt Writ Petition In Supreme Court,Governor Tamilisai,Governor Tamilisai Latest News Updates

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గవర్నర్‌ ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శాంతికుమారి రాజ్‌భవన్‌కు రాలేదని.. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గరని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ను సందర్శించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర సమయం లేదా అని పరోక్షంగా శాంతికుమారిని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం సీఎస్ వ్యవహరించలేదని, కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదని తమిళిసై తెలిపారు. ఇక చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేసిన గవర్నర్‌.. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై పరోక్ష విమర్శలు చేయడం గమనార్హం.

కాగా అసెంబ్లీలో ఆమోదించి పంపిన దాదాపు 10 బిల్లులకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారని ఆరోపిస్తూ గురువారం పిటిషన్‌ దాఖలు చేసింది. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. ఇటీవలి బడ్జెట్‌ సమావేశాల తర్వాత పంపించిన మరో మూడు బిల్లులకు కూడా గవర్నర్‌ ఆమోదం తెలపలేదని పిటిషన్‌లో పేర్కొంది. ఇక ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా గవర్నర్‌ కార్యదర్శిని చేర్చింది. గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదని, ఆమోదం తెలపకుండా బిల్లులను వాయిదా వేస్తే హక్కు కానీ, ఆలస్యం చేసే హక్కు కానీ లేదని గుర్తుచేసింది. శాసనసభ ఆమోదించిన అనేక బిల్లులకు ఆమోద ముద్ర వేయకపోవడంతో తరచూ రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందని, అందుకే ఆర్టికల్‌ 32 కింద సుప్రీంకోర్టు తన న్యాయ పరిధిని ఉపయోగించాలంటూ, అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పలేదని కూడా విన్నవించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + seventeen =