వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన, ఏపీలో రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు రూ.20,000 కోట్లు

Vizag Global Investors Summit-2023 Union Minister Nitin Gadkari Announces Rs 20000 Cr For Roads Connectivity In Ap,Vizag Global Investors Summit-2023,Union Minister Nitin Gadkari Announces Rs 20000 Cr,Nitin Gadkari Announces Rs 20000 Cr For Roads Connectivity,Mango News,Mango News Telugu,Nitin Gadkari Assures Of Strengthening Road,Global Investors Summit 2023 In Vizag,Vizag All Set For Global Investors Summit,G20 Summit,G20 Summit 2023,G20 India,G20 Summit 2023 India Live,G20 Summit Live,G20 India Live,G20 India 2023,2023 G20,2023 G20 New Delhi Summit,New Delhi Summit G20

విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా దీనిని ప్రారంభించగా.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఏపీ ఈరోజు గొప్ప కార్యక్రమం నిర్వహిస్తోందని, రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో రోడ్ కనెక్టివిటీ కీలకమని, అన్ని పోర్టులతో రహదారుల కనెక్టివిటీని బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

దీనిలో భాగంగా రాష్ట్రంలో రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు రూ.20,000 కోట్లు కేటాయిస్తామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇక ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని, ఆటో మొబైల్ ఇండస్ట్రీకి పలు రాయితీలు అందిస్తున్నామని వెల్లడించారు. అలాగే ఏపీలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు సిద్ధమని, 50-50 భాగస్వామ్యంతో వీటిని నిర్మించేలా చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక పర్యావరణరహిత వాహనాలదే భవిష్యత్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇదిలాఉండగా మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మిట్‌లో పెట్టుబడులతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇక ఈ కార్యక్రమానికి దేశీయ దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, నవీన్ జిందాల్, అర్జున్ ఒబెరాయ్ తదితరులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − one =