ఈరోజు న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగిన పరీక్షా పే చర్చా 2022లో విద్యార్థులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇది నాకు ఇష్టమైన కార్యక్రమం. కానీ కరోనా కారణంగా, మీలాంటి స్నేహితులను మధ్యమధ్యలో కలవలేకపోయాను. ఈరోజు కార్యక్రమం నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత నేను మీ అందరినీ కలిసే అవకాశం నాకు లభిస్తోంది. మీరు టాపర్‌లను అనుసరించవద్దు, మీ స్వంత ప్రణాళికలను అమలుపరచండి అని విద్యార్థులకు సూచించారు. అలాగే ఈ రోజు మనం డిజిటల్ గాడ్జెట్ల ద్వారా చాలా సులభంగా విషయాలను శోధించవచ్చు, తెలుసుకోవచ్చు. దీనిని ఒక అవకాశంగా పరిగణించాలి కానీ సమస్యగా ఎంచకూడదని ప్రధాని తెలిపారు.
పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడంపై ప్రధాని మోదీ విద్యార్థులకు కొన్ని చిట్కాలు చెప్పారు. మీ మనస్సులో ఉన్న భయాందోళనల వలన ఎటువంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు. మీ పరీక్షా సమయాన్ని అన్ని రోజుల మాదిరిగానే సులభమైన రొటీన్‌లో గడపమని చెప్పారు. పరీక్షలు జీవితంలో సులభమైన భాగమని మీ మనస్సులో మొదట నిర్ధారించుకోండి. మన అభివృద్ధి ప్రయాణంలో ఇవి చిన్న అడుగులని తెలుసుకోండి. మేము ఇంతకు ముందు చాలాసార్లు ఈ పరీక్షల దశను దాటాము అని తెలిపారు. పరీక్షా పే చర్చా అనేది ముఖ్యంగా ఒక ఇంటరాక్టివ్ సెషన్. బోర్డ్ పరీక్షల నేపథ్యంలో పరీక్షల ఒత్తిడిలో ఉండే విద్యార్థులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంభాషిస్తారు. పరీక్షలకు సంబంధించిన సమస్యలపై వారి ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ