కరోనా మహమ్మారి కారణంగా ఇటీవల జరగాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు మంగళవారం నాడు పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసినట్టు సమాచారం. ముందుగా జనవరి 29 వ తేదీన సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశముంది. అలాగే ఫిబ్రవరి 1, సోమవారం నాడు కేంద్ర బడ్జెట్ 2021-22 ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ