రాష్ట్రంలో తొలిసారిగా పైలట్‌ ప్రాజెక్టుగా షీక్యాబ్స్ పథకం,18 మంది మ‌హిళ‌ల‌కు షీక్యాబ్స్‌ పంపిణీ

Finance Minister Harish Rao, Harish Rao, Harish Rao Distributes 18 She Cabs in Sangareddy, Harish Rao Latest News, Mango News Telugu, Minister Harish Rao, Sangareddy, She Cabs, She Cabs Distribution, She Cabs in Sangareddy, She Cabs in Sangareddy District, telangana, Telangana Finance Minister Harish Rao, Telangana News

అతివలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు సమానంగా తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో తమ ప్రతిభ కనబర్చుతున్న మహిళామణులు డ్రైవింగ్‌లోనూ రాణిస్తున్నారు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దూసుకుపోతున్నారు. మహిళా ప్రగతితోనే రాష్ట్ర, దేశ ప్రగతి సాధ్యమవుతుందనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ప్రయోగాత్మకంగా సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ‘షీ క్యాబ్స్‌’ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 18 మంది మహిళలు దరఖాస్తు చేసుకుని డ్రైవింగ్‌ శిక్షణ పూర్తి చేసుకున్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం నాడు ఎస్సీ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో 18 మంది మ‌హిళ‌ల‌కు షీ క్యాబ్స్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు పంపిణీ చేశారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా షీ క్యాబ్స్ ప‌థ‌కాన్ని పైల‌ట్ ప్రాజెక్టుగా సంగారెడ్డిలో ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌ని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. మ‌హిళ‌లు విజ‌య‌వంతంగా కార్లు న‌డిపి ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిల‌వాల‌న్నారు. షీ క్యాబ్స్ ప‌థ‌కాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎస్సీ ల‌బ్దిదారుల‌కు ప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని మంత్రి తెలిపారు. 18 మందికి సబ్సిడీపై కార్లను ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.1,32,30,000 లను ప్రభుత్వం ఖర్చు చేసింది. కార్లలో జీపీఎస్‌ వసతి, ఆఫ్రాన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను అందుబాటులో ఉంచడంతో పాటు మహిళలకు రక్షణగా పెప్పర్‌ స్ప్రేలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. 18-45 ఏండ్ల వయసున్న మహిళలను ఈ ప‌థ‌కానికి ఎంపిక చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు క్రాంతికిర‌ణ్‌, మాణిక్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డితో పాటు ప‌లువురు నాయకులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =