కుమారస్వామికి గవర్నర్ మరో డెడ్ లైన్

Another Dead Line For Kumaraswamy To Prove Majority, Karnataka Assembly Floor Test Latest News, Karnataka Assembly Floor Test LIVE Updates, Karnataka Assembly Trust Vote Process Live Updates, Karnataka crisis live updates trust vote, Karnataka Governor Tells HD Kumaraswamy To Prove Majority, Karnataka Political News, karnataka trust vote live updates july 19, Mango News

కర్ణాటక రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది, బలపరీక్ష పై నిన్న గవర్నర్ వాజుభాయి వాళా ఇచ్చిన సమయం దాటినప్పటికీ ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోకపోవడం వలన, గవర్నర్ మరో అవకాశాన్ని ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై గవర్నర్ వాజుభాయి వాళా ఎప్పటికప్పుడు, కేంద్రప్రభుత్వానికి నివేదికలు అందజేస్తున్నారు.

మరో వైపు చర్చ పూర్తికాకుండా బలపరీక్ష నిర్వహించలేనని, తనను ఎవరు శాసించలేరని స్పీకర్ రమేష్ కుమార్ తెలిపారు. అసలు సభ్యులు రాజీనామా ఎందుకు చేసారనే అంశంపై చర్చ జరగాలని కుమారస్వామి పట్టు పట్టారు, మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుంటే ఏమి చేసారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించగా, కాంగ్రెస్ సభ్యులు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బిజెపి ప్రలోభాలకు గురి చేస్తూంటే మేము ఏమి చేస్తామని తిరిగి ప్రశ్నించారు. కాంగ్రెస్, జెడిఎస్ సభ్యుల మధ్య వాదనలతో సభలో గందరగోళం నెలకుంది.

మరో వైపు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ,ఈ రోజు చర్చ జరుగుతుండంవలన విశ్వాస పరీక్ష జరపడం కుదరదని, సోమవారం జరిగే సభలో బలపరీక్ష జరిగే అవకాశముందని చెప్పారు. జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ నేతలు మరోసారి సుప్రీం కోర్టుని ఆశ్రయించారు, ప్రభుత్వం విప్ జారీ చేసే విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలలో స్పష్టత కోరుతూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండురావు ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. క్షణ క్షణానికి మారుతున్న పరిణామాలతో దేశమంతా కర్ణాటక రాజకీయాలపై దృష్టి సారించింది. ఈ రోజు కూడ బలపరీక్ష జరగకుంటే, గవర్నర్ రాష్ట్రపతి పాలనకు ఆదేశిస్తారా, లేక సోమవారం నాడు జరిగే సభలో బలపరీక్ష జరుగుతుందా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

 

 

[subscribe]
[youtube_video videoid=RfJWc8gCCsQ]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 3 =