ప్రముఖ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ మరోసారి ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు దక్కించుకున్నారు. 2015లో, 2022లో రికీ కేజ్ గ్రామీ మ్యూజిక్ అవార్డును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా లాస్ ఏంజెల్స్ లో జరిగిన 65వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో కూడా బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ కేటగిరిలో ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్ కు గానూ స్టీవర్ట్ కోప్‌ల్యాండ్ తో కలిసి రికీ కేజ్ గ్రామీ అవార్డు సొంతం చేసుకున్నారు. అనంతరం రికీ కేజ్ ట్వీట్ చేస్తూ, “ఇప్పుడే నా 3వ గ్రామీ అవార్డును గెలుచుకున్నాను. చాలా కృతజ్ఞతలు, మాటలు రావడం లేదు!, ఈ అవార్డును భారతదేశానికి అంకితం చేస్తున్నాను” అని పేర్కొంటూ పోటోలను షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు రికీ కేజ్ కు అభినందనలు తెలిపారు.
మూడవ గ్రామీ అవార్డును గెలుచుకున్నందుకు మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. “మరో విజయాన్ని సాధించినందుకు రికీకేజ్ కు అభినందనలు. మీ రాబోయే ప్రయత్నాలకు శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ట్వీట్ చేస్తూ, “కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ సంగీత స్వరకర్త మరియు పర్యావరణవేత్త రికీకేజ్ 3వ గ్రామీ అవార్డుకు గెలుచుకున్నందుకు అభినందనలు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీకు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
Congratulations @rickykej for yet another accomplishment. Best wishes for your coming endeavours. https://t.co/mAzRw3Yoqg
— Narendra Modi (@narendramodi) February 6, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE