కందుకూరు తొక్కిసలాట ఘటనపై విచారణ ప్రారంభం.. శేషశయనా రెడ్డి కమిషన్ ముందుకు టీడీపీ నేతలు

Kandukur Stampede Investigation Starts TDP Leaders Attend Before Justice Seshasayana Reddy Commission,Kandukur Stampede Investigation Starts,TDP Leaders Attend Before, Justice Seshasayana Reddy Commission,Mango News,Mango News Telugu,Seshasayana Reddy Kadapa,Byreddy Seshasayana Reddy Latest News,Kandukur Bus Stand,Kandukur Stampede News,Kandukur Stampede Today,Sesha Sena Reddy,Seshasayana Reddy Comisssion Report,Shesha Sena Reddy,Sheshashayana Reddy Report News

ఒకప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత నెల్లూరు జిల్లాలోని కందుకూరులో డిసెంబరు 28న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుని దాదాపు ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే గుంటూరులో జరిగిన మరో తొక్కిసలాటలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 11 మంది మరణించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. విచారణ జరిపి తొక్కిసలాటకు కారణమేమిటో తేల్చాలని జస్టిస్ బి. శేషశయనారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కమిషన్ ప్రభుత్వానికి సూచించనుంది.

ఇక ఇప్పటికే ఘటనాస్థలిని జస్టిస్ శేషశయనా రెడ్డి విచారణ కమిషన్ పరిశీలించింది. అధికారులతో కలిసి కందుకూరులోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర తొక్కిసలాట జరిగిన స్థలాన్ని కమిషన్ పరిశీలించింది. ఎనిమిది మంది మృతికి దారితీసిన తొక్కిసలాట కారణంగా ప్రజలు పడిపోయిన డ్రైనేజీ కాలువను కూడా కమిషన్ పరిశీలించింది. అలాగే బాధితుల కుటుంబసభ్యులను, బంధువులను కూడా కమిటీ విచారించింది. ఈ క్రమంలో కందుకూరు ఘటనపై జస్టిస్ శేషశయనా రెడ్డి కమిషన్ మంగళవారం విచారణ ప్రారంభించింది. విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో ఈరోజు జస్టిస్ శేషశయనా రెడ్డి కమిషన్ విచారణ చేస్తోంది. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు ఇంటూరి రాజేష్, నాగేశ్వరరావులు కమిషన్ ముందు హజరయ్యారు. మరోవైపు గుంటూరు ఘటనపై కూడా ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తి చేసింది. ఇక విచారణ పూర్తి చేసిన తర్వాత, కమిటీ ఈ రెండు ఘటనలపై తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + eleven =