ఢిల్లీ మెట్రో లోని మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్–బొటానికల్ గార్డెన్) లో భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాలను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కమాండ్ సెంటర్ల ద్వారా డ్రైవర్ రహిత రైలు సేవలను చేపట్టనున్నారు. దీంతో 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్‌లో ఈ రోజు నుంచే డ్రైవర్ రహిత రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. మరోవైపు 57 కిలోమీటర్ల పొడవున్న పింక్ లైన్ (మజ్లిస్ పార్క్-శివ్ విహార్) మార్గంలో కూడా 2021 మధ్య నాటికి డ్రైవర్ రహిత రైలు సేవలు ప్రారంభించనున్నట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) వెల్లడించింది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని భవిష్యత్ తరాల కోసం పట్టణ అభివృద్ధిని సిద్ధం చేసే ప్రయత్నంగా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు దేశాన్ని సిద్ధం చేయడం పరిపాలన యొక్క ముఖ్యమైన బాధ్యతని అన్నారు. 2014 లో కేవలం 5 నగరాల్లో మాత్రమే మెట్రో రైలు ఉందని, నేడు 18 నగరాల్లో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. అలాగే 2025 నాటికి మెట్రోరైల్ సేవలను 25 కి పైగా నగరాలకు విస్తరించబోతున్నామన్నారు. ఇక 2014 లో దేశంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రో మార్గాలు మాత్రమే ఉండగా, నేడు మూడు రెట్లు ఎక్కువుగా 700 కిలోమీటర్ల పైగా మెట్రో మార్గాలు అందుబాటులోకి వచ్చాయని, 2025 నాటికి 1700 కి.మీ.కి విస్తరించడానికి ప్రయత్నిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ