పంజాబ్ సెక్టర్‌లో S-400 క్షిపణి వ్యవస్థ మోహరించిన భారత్

First S-400 Air Defence System In Punjab Sector, First Squadron of S-400 Deployed in Punjab, First squadron of S-400 deployed in Punjab sector, IAF Deploys First S-400 Air Defence System, IAF Deploys First S-400 Air Defence System In Punjab, IAF Deploys First S-400 Air Defence System In Punjab Sector, IAF deploys first squadron of Russia’s S-400 air defence system, India deploys first S-400 air defence missile system in Punjab, India deploys first S-400 air defence system, India deploys first S-400 air defence system in Punjab, Mango News, Punjab Sector, S-400 air defence missile system in Punjab

భారత్ సరిహద్దుల వద్ద తన భద్రతను, సామర్ధ్యాన్ని రోజు రోజుకూ పెంచుకుంటోంది. తాజాగా, రష్యాలో తయారైన ఎస్-400 మిసైల్ సిస్టమ్‌ తొలి స్క్వాడ్రన్‌ను భారత వాయుసేన (ఐఏఎఫ్) పంజాబ్ సెక్టర్‌లో సోమవారం మోహరించింది. దీంతో దేశ గగనతల రక్షణ సామర్థ్యం మరింత శక్తివంతమైంది. సాధారణంగా భారత్ తన రక్షణ వ్యూహాలను గురించి అధికారికంగా ప్రకటించదు. ఈ విషయంలో పూర్తి గోప్యతను పాటిస్తుంటుంది. కానీ, ఈ విషయంలో మాత్రం అది తన వైఖరికి భిన్నంగా, కొన్ని ఆంగ్ల పత్రికలతో ఈ సమాచారం వెల్లడించింది.

S-400 ట్రయాంఫ్ అనేది గగనతల రక్షణ వ్యవస్థ. ప్రపంచంలో ఇప్పటివరకు రష్యా, చైనా, టర్కీ దేశాలు దీనిని ఉపయోగిస్తున్నాయి. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ వ్యవస్థ భారత్ కు వ్యూహాత్మకంగా ఎంతో ఉపయోగకరం. ఇది రాడార్లు, క్షిపణులతో పనిచేసి ప్రత్యర్థుల కదలికలను ముందే పసిగట్టి వాటిని కూల్చివేసే రక్షణ వ్యవస్థ. 600 కి.మీ. దూరంలోని రాడార్లను కూడా ఇవి పసిగట్టగలవు. అంతేకాదు, దీనిని కేవలం 5 ని.ల. లోపులోనే ప్రతిదాడికి సిద్ధం చేయించవచ్చు. ఒకవైపు పాకిస్తాన్.. మరోవైపు చైనా.. భారత్ కు పక్కలో బల్లెంలా ఉంటున్నాయి. దీంతో పంజాబ్ సెక్టార్ వద్ద వ్యూహాత్మకంగా భారత్ మోహరించింది.

పాకిస్థాన్, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి రక్షించగలిగే సామర్థ్యం దీని బ్యాటరీలకు ఉన్నట్లు తెలిపారని పేర్కొంది. భారత దేశానికి రక్షణ రంగంలో ప్రధాన భాగస్వామి అమెరికా. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత్ కొనుగోలు చేస్తుండటంపై అమెరికా కొంత విముఖత చూపింది. 2015లో ఈ వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం కుదిరిందని, 4.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం 2018లో ఖరారైందని వివరించింది భారత్. అయితే, తాను అభివృద్ధిపరచిన టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (టీహెచ్ఏడీ), పేట్రియాట్ సిస్టమ్స్‌ను ఇస్తామని, భారత్‌కు సర్దిచెప్పటానికి అమెరికా ప్రయత్నించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − thirteen =