అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2, సూరత్ మెట్రో రైల్ కు భూమి పూజ చేసిన పీఎం మోదీ

Ahmedabad Metro Rail Project, Ahmedabad Metro Rail Project Phase-II, Bhoomi Puja for Ahmedabad Metro Rail Project, Bhoomi Puja for Ahmedabad Metro Rail Project Phase-II, Mango News, PM Modi, PM Modi Ahmedabad Metro Rail project, PM Modi Performs Bhoomi Puja for Ahmedabad Metro Rail Project Phase-II, PM Modi Performs Bhoomi Pujan of Ahmedabad, pm narendra modi, PM Narendra Modi performs bhoomi poojan, Surat Metro Rail

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2 మరియు సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా,కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్రాత్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ రూపాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశంలోని రెండు ముఖ్యమైన వ్యాపార కేంద్రాలైన అహ్మదాబాద్, సూరత్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు మెట్రో ఒక బహుమతి అని పేర్కొన్నారు. రూ.17 వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు ఈ రోజు ప్రారంభమైనట్లు తెలిపారు.

27 నగరాల్లో 1000 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్ నిర్మాణ పనులు:

దేశంలో మెట్రో సేవల విస్తరణలో గత ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వివరించారు. 2014 కి ముందు 10-12 సంవత్సరాలలో 200 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్‌తో పోలిస్తే, గత 6 సంవత్సరాలలోనే 400 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం మొత్తం 27 నగరాల్లో 1000 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇంతకుముందుఇంటిగ్రేటెడ్ మోడరన్ థింకింగ్ లేదని, అలాగే మెట్రోకు జాతీయ విధానం లేదని అన్నారు. ఇక ఆయా నగరాల్లో మిగిలిన రవాణా వ్యవస్థతో కూడా మెట్రో అనుసంధానం లేదని చెప్పారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మెట్రో ఉన్న నగరాల్లో రవాణాను ఒక సమగ్ర వ్యవస్థగా, సమిష్టి పనిచేసేలా అభివృద్ధి చేస్తుందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ