రాత్రి 8.45 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

Mango News, national news, PM Modi, PM Modi to Address the Nation, PM Modi will Address the Nation, PM Modi will Address the Nation on the COVID-19 Situation, PM Modi will Address the Nation on the COVID-19 Situation at 8:45 PM Today, pm narendra modi, PM Narendra Modi Address the Nation, PM Narendra Modi to Address the Nation, PM Narendra Modi Video Conference

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8.45 గంటలకు కరోనా పరిస్థితిపై దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత ఆరురోజులుగా 2 లక్షల పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ బాటపట్టాయి. ఇక దేశంలో కరోనా పరిస్థితిపై రెండ్రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పలు మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో, ప్రముఖ వైద్యులుతో, దేశంలోని టాప్ ఫార్మా కంపెనీలతో, వ్యాక్సిన్ తయారీ సంస్థల ప్రతినిధులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ ఏ కీలక ప్రకటన చేయనున్నారనే ఆసక్తి ప్రజల్లో నెలకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ