ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. టాప్ బిడ్డర్‌గా నిలిచిన ముఖేష్ అంబానీ సంస్థ జియో, కేంద్రానికి రూ. 1.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం

India's Biggest 5G Spectrum Action Ends Today with Bids Crossing A Record of Rs 1.5 Lakh Crore, India's biggest ever auction of airwaves ended today, India's Biggest 5G Spectrum Action Ends Today, 5G Spectrum Action Bids Crossing A Record of Rs 1.5 Lakh Crore, record of over ₹ 1.5 lakh crore worth of spectrum being sold, Reliance Jio was the top bidder to the airwaves, 5G Spectrum Action Ends Today, 5G Spectrum Action, mega auction for the 5G spectrum has concluded, Reliance Jio tops table with Rs 88078 crore bids, 1.5 lakh crore from India's first auction of 5G spectrum, India's first auction of 5G spectrum, India's first 5G spectrum auction concluded after seven days of bidding, 5G Spectrum Action News, 5G Spectrum Action Latest News, 5G Spectrum Action Latest Updates, 5G Spectrum Action Live Updates, Mango News, Mango News Telugu,

భారతదేశపు అతిపెద్ద 5G స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ సోమవారం 7వ రోజున ముగిసింది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో ₹ 1.5 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ విక్రయించబడింది. మొత్తం 10 బ్యాండ్లలో 72 GHz స్పెక్ట్రాన్ని కేంద్రం వేలంలో ఉంచింది. ముఖేష్ అంబానీకి చెందిన జియో సంస్థ ఎయిర్‌ సేవల రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్, వోడాఫోన్ కంపెనీలు నిలిచాయి. దీంతో ఈ వేలం ద్వారా కేంద్రానికి రూ. 1.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం రూ. 1,50,173 కోట్లుగా ఉంది. అయితే వేలం ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగినా 600 Mhz, 800 Mhz, 2300 Mhz బ్యాండ్లకు బిడ్లు ఏవీ దాఖలు కాకపోవడం విశేషం.

కాగా జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు దేశవ్యాప్తంగా సేవలందించే స్పెక్ట్రమ్ దక్కించుకోగా, వోడాఫోన్-ఐడియా కంపెనీ మాత్రం ఎంపిక చేసుకున్న పరిమిత సర్కిళ్లలోని స్పెక్ట్రమ్ కోట్ చేసినట్లు సమాచారం. అల్ట్రా-హై స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించగల సామర్థ్యం ఉన్న 5G స్పెక్ట్రమ్, గత సంవత్సరం విక్రయించబడిన రూ. 77,815 కోట్ల విలువైన 4G ఎయిర్‌వేవ్‌లకు దాదాపు రెండింతలు మరియు 2010లో 3G వేలం ద్వారా రూ. 50,968.37 కోట్లకు మూడు రెట్లు పెరిగింది. రిలయన్స్ జియో 4G కంటే 10 రెట్లు వేగవంతమైన ప్రసారం, లాగ్-ఫ్రీ కనెక్టివిటీని అందించగల సామర్థ్యం ఈ ఎయిర్‌వేవ్‌లకు ఉంటుంది. మరోవైపు కొత్తగా ప్రవేశించిన అదానీ గ్రూప్ ప్రైవేట్ టెలికాం నెట్‌వర్క్ ఏర్పాటు కోసం 26 Mhz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + nineteen =