ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 11, శుక్రవారం నాడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు రూ.5000 కోట్ల వ్యయంతో నిర్మించిన టెర్మినల్-2ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ టెర్మినల్-2ను బెంగుళూరు గార్డెన్ సిటీకి నివాళిగా రూపొందించారని మరియు ప్రయాణీకుల అనుభవం గార్డెన్‌లో నడిచినట్టుగా ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు 10,000 కుపైగా చదరపు మీటర్ల గ్రీన్ వాల్స్, హ్యాంగింగ్ గార్డెన్స్, అవుట్ డోర్ గార్డెన్స్ గుండా ప్రయాణిస్తారన్నారు. అలాగే ఈ టెర్మినల్-2 ప్రయాణీకుల నిర్వహణ సామర్ధ్యం సంవత్సరానికి ప్రస్తుత 2.5 కోట్ల నుండి.5-6 కోట్ల వరకు పెరగనుందని పేర్కొన్నారు.
కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముందుగా శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బెంగుళూరులోని విధాన సౌధలో సెయింట్ పోయెట్ శ్రీ కనక దాసు మరియు మహర్షి వాల్మీకి విగ్రహాలకు ప్రధాని పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ఉదయం 10.20 గంటలకు బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు 108 అడుగుల నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. ఇక మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE