ఫేస్‍బుక్ మాతృ సంస్థ మెటా సంచలన నిర్ణయం.. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ

Facebook's Parent Company Meta Begins Job Cut Fires Huge Number of Employees, Facebook Parent Company Meta, Meta Begins Job Cut, Meta Fires Huge Number of Employees,Mango News,Mango News Telugu,Facebook Layoff Employees,Meta Layoff Employees,Meta Latest News And Updates,Facebook News And Updates, Facebook Cuting Employees Jobs, Facebook News And Latest Updates, Mark Zuckerberg, Facebook CEO

ఫేస్‍బుక్ మాతృ సంస్థ మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న 11వేల మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగుల సంఖ్యను సుమారు 13శాతం మేర తగ్గించుకుంటున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ బుధవారం కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయం తమ సంస్థ చరిత్రలోనే అత్యంత కఠిన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఇక ఉద్యోగం నుంచి ఉన్నపళాన తొలగించనున్న ఎంప్లాయిస్‍కు ఆర్ధికంగా కొంత ఉపశమనం కలిగేలా సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు జుకర్ బర్గ్ తెలిపారు. వీరందరికీ ఎటువంటి పరిమితి లేకుండా 16 వారాల మూల వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే దాదాపు ఆరు నెలల పాటు ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కూడా సంస్థ భరిస్తుందని ఆయన చెప్పారు. నేటి నుంచే ఎంప్లాయిస్ తొలగింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఇక 2004లో ఫేస్‍బుక్ ప్రారంభమయ్యాక ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. డిజిటల్ ప్రకటనల ఆదాయం తగ్గుముఖం పట్టడం, పలుదేశాల్లో తీవ్ర ఆర్ధిక మాంద్యం తలెత్తడం వంటి కారణాల వలన మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం భారీ దిగ్గజ సంస్థలు ఖర్చులను తగ్గించుకునేందుకు అంటూ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇక ఇటీవలే ఎలోన్ మస్క్ కైవసం చేసుకున్న ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‍ఫామ్ ట్విట్టర్ సంస్థ ఇప్పటికే 50శాతం మంది ఎంప్లాయిస్‍కు ఏకకాలంలో ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెటా సంస్థ కూడా తన ఉద్యోగులను భారీగా తగ్గించడానికి ప్రణాళికలు రూపొందించింది. కాగా మెటా యాజమాన్యంలోని ఫేస్‍బుక్, వాట్సాప్, ఇన్‍స్టాగ్రామ్‍తో పాటు మిగిలిన ప్లాట్‍ఫామ్‍లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 87,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 2 =