మే 1 నుండి 18 ఏళ్ళు పైబడినవారికీ కరోనా టీకా, ప్రారంభమైన రిజిస్ట్రేషన్స్

Vaccine Registration for People Above 18 Years of Age Start from 4 PM on 28th April, COVID-19 Vaccination, COVID-19 Vaccination News, COVID-19 Vaccination Registration, COVID-19 Vaccination Registration For 18-44 Years Old, COVID-19 Vaccination Registration For 18-44 Years Old On CoWIN Portal, COVID-19 Vaccination Registration For 18-44 Years Old On CoWIN Portal To Begin At 4 PM Today, COVID-19 Vaccination Updates, CoWIN Portal, CoWIN portal for vaccination doses, Government Of India, Mango News, Steps to register on CoWIN portal for vaccination doses, Vaccination Registration

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ పక్రియను మరింత వేగవంతం చేసే దిశగా మూడో దశలో భాగంగా మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 18ఏళ్లు పైబడిన వారు కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఏప్రిల్ 28, బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి కోవిన్ వెబ్‌సైట్‌లో (www.cowin.gov.in), ఆరోగ్య సేతు యాప్ మరియు ఉమాంగ్ (UMANG) యాప్‌లో రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అయ్యాయి.

“ఏప్రిల్ 28 సాయంత్రం 4 గంటలకు కోవిన్ వెబ్‌సైట్‌, ఆరోగ్య సేతు మరియు ఉమాంగ్ యాప్‌లలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. 18 ఏళ్ళు పైబడినవారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు మే 1వ తేదీ నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాలు మరియు ప్రైవేట్ కేంద్రాలలో ఎన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయో అనే దానిని బట్టి అపాయింట్‌మెంట్స్ ఖరారవుతాయి” అని మై గవ్ ఇండియా ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.

అలాగే 18-45 సంవత్సరాల వాళ్ళకి సెల్ఫ్ రిజిస్ట్రేషన్స్ మరియు ముందస్తు అపాయింట్‌మెంట్స్ ద్వారా మాత్రమే వ్యాక్సిన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని, ఎలాంటి వాకిన్‌ రిజిస్ట్రేషన్లు ఉండబోవని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 45 ఏళ్లు పైబడినవారికి వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతుంది. ఏప్రిల్ 28, బుధవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 14.78 కోట్లు (14,78,27,367) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 3 =